Begin typing your search above and press return to search.

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2027 సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాకా’, అనిల్ రావిపూడి-వెంకటేష్-కల్యాణ్ రామ్ సినిమా, శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’, శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ నిలవనున్నాయి. సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలపైనా చర్చ జరుగుతోంది. ఇక క్రిస్మస్‌కు బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’, కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ సినిమాలు రానున్నాయి.

By:  Ramesh Palla   |   26 Nov 2026 2:32 PM IST
క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి సంక్రాంతి సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు వస్తే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, మంచి వసూళ్లు వస్తాయి అనేది మొదటి నుంచి ఫిల్మ్‌ సర్కిల్స్‌ వారిలో ఉన్న అభిప్రాయం. అందుకే ప్రతి సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కావడం మనం చూస్తూనే ఉన్నాం. గత నాలుగు అయిదు ఏళ్లుగా సంక్రాంతి పోటీ మరీ ఎక్కువ అయింది అనడంలో సందేహం లేదు. స్టార్‌ హీరోల సినిమాలు ఒకటి లేదా రెండు విడుదల అవుతూ ఉండగా, మీడియం రేంజ్‌ హీరోల సినిమాలు, చిన్న సినిమాలు కూడా మూడు నాలుగు విడుదల కావడం మనం ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం. 2027 సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు చాలా విడుదలకు రెడీగా ఉన్నాయి. మొదట సంక్రాంతికి వస్తాం అంటూ ప్రకటించిన ఒకటి రెండు సినిమాలు వాయిదా పడ్డ ఇప్పటికీ చాలా సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి.

చిరంజీవి నటించిన కాకా సినిమా...

2027 సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ప్రధానంగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'కాకా' ఉంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి మాస్ అవతారం ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కాకా సినిమాకు విపరీతమైన పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయింది. ఇదే సమయంలో చిరంజీవి నటించి గత రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చిన 'విశ్వంభర' సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సంక్రాంతికి చిరంజీవి రెండు సినిమాలతో లేదా ఏదో ఒక సినిమా తో రావడం మాత్రం పక్కా. ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి అనిల్‌ వినోదాల విందు ఉండబోతుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా నటిస్తున్న జనవరి 12 విడుదల సినిమాతో అనిల్‌ రావిపూడి 2027 సంక్రాంతి బరిలో నిలువబోతున్నాడు. ఇప్పటికే అనిల్‌ ప్రమోషన్‌ హడావిడి మొదలు పెట్టాడు.

శర్వానంద్‌ జార్జ్‌ క్రిష్ సినిమా...

సంక్రాంతికి సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటించిన సంబరాల ఏటిగట్టు సినిమాను సైతం విడుదల చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఫ్యామిలీ ప్యాక్‌ సినిమాను సైతం సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న శర్వానంద్‌ మూవీ 'జార్జ్‌ క్రిష్‌' సైతం సంక్రాంతి రిలీజ్ లైన్‌లో ఉంది. ఇవి కాకుండా ఒకటి రెండు చిన్న సినిమాలు సైతం సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నాయి. సంక్రాంతి ముందు రాబోతున్న క్రిస్మస్ సీజన్‌లోనూ భారీ ఎత్తున సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ప్రధానంగా బాలకృష్ణ హీరోగా నటించిన దాదా విడుదల కాబోతుంది. బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య కు ఈ సినిమా కచ్చితంగా మరో విజయాన్ని కట్టబెట్టడం ఖాయం అని విశ్లేషకులు సైతం నమ్మకంతో ఉన్నారు.

కింగ్‌ 100 సినిమాతో నాగార్జున...

క్రిస్మస్‌కి నాగార్జున 100వ సినిమా కింగ్‌ 100 సైతం విడుదల కాబోతుంది. నాగార్జున కెరీర్‌లో స్పెషల్‌ మూవీ, పైగా ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా క్రిస్మస్‌ కి వినోదాల విందు ఇవ్వడం ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. క్రిస్మస్‌ కానుకగా బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ నటించిన కింగ్‌ సినిమా సైతం రాబోతుంది. ఇది తెలుగు వర్షన్‌ ను విడుదల చేసేందుకు గాను ప్రముఖ నిర్మాత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇంకా క్రిస్మస్‌ కి రియాలిటీ సినిమా సైతం రాబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఈ సినిమాకి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. కనుక తప్పకుండా ఈ సినిమా క్రిస్మస్‌ బరిలో నిలిచి సక్సెస్‌ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కిరణ్ అబ్బవరం సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి క్రిస్మస్ నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు సినిమాల జోరు ఓ రేంజ్‌లో సాగబోతుంది.