Begin typing your search above and press return to search.

2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...

2024 నుంచి 2026 మధ్య తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ ఇమేజ్ కంటే కథకే ప్రేక్షకులు పట్టం కట్టారు. హనుమాన్, లక్కీ భాస్కర్, కమిటీ కుర్రోళ్లు, కే, కోర్టు వంటి చిత్రాలు బలమైన కథ, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో విజయాలు అందుకున్నాయి. తాజాగా రవితేజ నటించిన ఇరుముడి కూడా కంటెంట్‌తోనే భారీ విజయాన్ని సాధించి ఈ జాబితాలో చేరింది.

By:  Gopi Velupala   |   12 Nov 2026 11:36 AM IST
2024-26 మధ్య తెలుగులో వచ్చిన బెస్ట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇవేనా...
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదగడం చాలా గర్వకారణం... ఒకవైపు విజువల్ వండర్స్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరిస్తుంటే, మరోవైపు కేవలం బలమైన కథ, కథనాలను నమ్ముకొని వచ్చిన 'కంటెంట్ బేస్డ్' సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. స్టార్ ఇమేజ్ కంటే కథే గొప్పదని ప్రూవ్ చేస్తూ 2024 నుంచి 2026 మధ్య ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఘన విజయం సాధించిన ముఖ్య చిత్రాలపై ప్రత్యేకమైన విశ్లేషణ...

హనుమాన్

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పరిమిత బడ్జెట్ లో వచ్చి భారీ విజయం సాధించింది. అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకున్నప్పటికి కథలోని ప్యూర్ ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దర్శకుడు కథనంలో తీసుకున్న జాగ్రత్తల వల్ల సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా సాగింది...

లక్కీ భాస్కర్

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'లక్కీ భాస్కర్' సినిమాలో ఒక మధ్యతరగతి వ్యక్తి కుటుంబాన్ని పోషించడానికి ఎలా ఇబ్బంది పడుతాడు. పేదరికానికి చెక్ పెట్టడానికి ఆయన ఎలాంటి స్కామ్ చేశాడు. ఫైనల్ గా కోటీశ్వరుడు గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ ని గ్రిప్పింగ్ గా రాసుకొని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా 'లక్కీ భాస్కర్' సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించడానికి గల ముఖ్య కారణం అందులోని స్క్రీన్ ప్లే కథ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే లో వైవిధ్యాన్ని చూపించాడు. తెలుగు లో అప్పటివరకు స్కాం కి సంబంధించిన సినిమా రాకపోవడం, ఈ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమా ఉండటంతో సూపర్ సక్సెస్ ని సాధించింది...

కమిటీ కుర్రాళ్ళు

ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ కథతో వచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. విలేజ్ లో ఉండే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది. ఒకరికోసం ఒకరు ఎలా నిలబడతారు అనే పాయింట్ ను బాగా చూపించారు. ప్రతి క్యారెక్టర్ ను బాగా వాడుకున్నారు.

క

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ మూవీ కర్మ సిద్ధాంతానికి సంబంధించిన కథగా తెరకెక్కింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశారు. దాంతో సగటు ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం చాలా రోజుల పాటు గుర్తుండిపోయింది.

కోర్టు

పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మీద చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కింది. కంటెంట్ లో క్లారిటీ ఉండటం లాజిక్స్ ఎక్కడ మిస్ అవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఈ సినిమా బాగా నచ్చింది...

ఇరుముడి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీ రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలవడం విశేషం. ఈ సినిమా ప్యూర్ కంటెంట్ బేస్డ్ మూవీ గా తెరికెక్కింది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఐటెం సాంగ్ లు, రక్తపాతలు చూపించకుండా కేవలం కంటెంట్ ను బేస్ చేసుకొని సినిమాని ముందుకు నడిపించారు. దానివల్ల సినిమాలో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి అనవసరమైన ఎపిసోడ్స్ అయితే కనిపించలేదు. కథలో పూర్తిగా లీనమైపోయి కథతో పాటే ట్రావెల్ చేశాడు. అందుకే రిపీటెడ్ గా చూస్తూ భారీ విజయాన్ని కట్టబెట్టారు. మొత్తానికైతే రవితేజ మరోసారి లైమ్ లైట్ లోకి రావడానికి ఈ సినిమా చాలావరకు హెల్ప్ అయింది...