Begin typing your search above and press return to search.

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

సన్నీ డియోల్ నటిస్తున్న ‘సూర్య: అంత సే ఆరంభ్ తక్’ సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్ 20న విడుదల కావాల్సిన ఈ చిత్రంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ క్లియరెన్స్ తర్వాత కొత్త తేదీ ప్రకటించనున్నారు. జనవరి 15, 2027న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

By:  Srikanth Kontham   |   17 Nov 2026 11:09 AM IST
డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!
X

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌ చిత్రం `సూర్య: అంత సే ఆరంభ్ తక్` విడుదల ఊహించని విధంగా వాయిదా పడింది. నవంబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన సినిమా సరిగ్గా నాలుగు రోజుల ముందు వాయిదా పడటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు.. వివాదం నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మలయాళంలో ఘనవిజయం సాధించిన `జోసెఫ్` చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా టీజర్ అక్టోబర్ లో విడుదలై మంచి హైప్‌ను సంపాదించుకుంది. అయితే సినిమాలోని కొన్ని అంశాలపై ఐఎంఏ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడం వివాదానికి కారణమైంది. వైద్య వృత్తిని.. సిబ్బందిని తప్పుగా చూపించే ఉద్దేశం తమకు లేదని మేకర్స్ స్పష్టం చేసినా? వివాదానికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి రావడంతో రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయింయ‌చారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అన్ని క్లియరెన్స్‌లు పొందిన తర్వాతే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఇప్పటికే కొన్ని బాలీవుడ్.. హాలీవుడ్ సినిమాలు క్యూలో ఉండటంతో ఈ చిత్రాన్ని 2026లో కాకుండా 2027లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. జనవరి 15న సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మంచి రీమేక్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాలని భావించిన సన్నీ డియోల్ అభిమానులకు ఈ నిర్ణయం నిరాశ క‌లిగించినా? అన్ని వివాదాలు తొలగిపోయి క్లీన్‌గా బయటకు రావాలని వారు కోరుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో స‌న్నిడియోల్ న‌టిస్తోన్న యాక్ష‌న్ సినిమాలు మంచి ఫ‌లితాలు సాధిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన` జాట్` తోనూ స‌న్ని మంచి విజ‌యం అందుకున్నారు.

ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాప్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉందంటున్నారు. `జాట్` అనంత‌రం రిలీజ్ అయిన `బోర్డ‌ర్ 2` కూడా బ్లాక్ బ‌స్ల‌ర్ అయింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `రామాయ‌ణం పార్ట్ 1` లో హ‌నుమాన్ పాత్ర‌లోనూ స‌న్ని న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మంచి ఫ‌లితాలు సాధించింది. ప్ర‌స్తుతం స‌న్ని చేతిలో మ‌రో మూడు ప్రాజెక్ట్ లున్నాయి. అవి షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.