రామాయణ: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్లబ్ ఇంకెంత దూరం?
రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. భారత్‌లో రూ.685.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల మార్క్ దాటింది. వేగంగా రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రెండో భాగాన్ని 2028లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
By: Sivaji Kontham | 15 Nov 2026 3:12 PM ISTరణ్‌బీర్ కపూర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం `రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్` బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో.. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ భారీ పాన్ వరల్డ్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి.. సౌతిండియా సహా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
ఇక రెండో శనివారం రోజున ఈ సినిమా కలెక్షన్లు ఊహించని విధంగా మళ్లీ పుంజుకోవడం విశేషం. మొదటి శుక్రవారంతో పోలిస్తే రెండో శనివారం ఏకంగా రూ. 72.90 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో భారత్‌లో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 685.60 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 1200 కోట్ల మార్క్‌ను దాటడం విశేషం. అంతేకాకుండా `పుష్ప 2`,`ధురంధర్ 2` చిత్రాల తర్వాత అత్యంత వేగంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది.
మొదటి వారంలో రూ. 564 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. తొలి సోమవారం ఏకంగా రూ. 107.50 కోట్లు రాబట్టి బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక మండే కలెక్షన్ల రికార్డును సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అద్భుత నటనాభినయం.. సాయిపల్లవి బ్రిలియన్సీ.. పాత్రధారుల సమయోచిత నటనతో పాటు.. భారీతనం నిండిన గ్రాఫిక్స్ కూడా జనాలను అబ్బురపరుస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ పురాణేతిహాస కథకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ కూడా భారీ కలెక్షన్లకు సహకరిస్తోంది.
రెండో వారంలోనూ కలెక్షన్ల జోరు తగ్గకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 10 రోజుల్లో 1200 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మరో 10 రోజులు ఆడటం కష్టమేమీ కాదు. ఇది సునాయాసంగా 2000 కోట్ల వసూళ్లను సాధిస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. ఇదే హుషారులో రామాయణ పార్ట్ 2 ని కూడా అత్యంత అసాధారణ విజువల్ క్వాలిటీతో అందించాలని నమిత్ మల్హోత్రా టీమ్ సభ్యులు భావిస్తున్నారు. దీనికోసం ఏడాది పైగా సమయం తీసుకోనుంది గనుక 2028లోనే రెండో భాగం సినిమాని విడుదల చేస్తామని ఇటీవల వెల్లడించారు.
