Begin typing your search above and press return to search.

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం పార్ట్ 1’ విడుదలైన ఏడు రోజుల్లోనే ఇండియాలో రూ.511.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో వేగంగా రూ.500 కోట్ల మార్కును అందుకున్న చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆరు రోజుల్లోనే ఈ ఘనత సాధించిన ‘ధురంధర్ 2’ మొదటి స్థానంలో ఉండగా, ‘పుష్ప 2’ 11 రోజులు తీసుకుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   12 Nov 2026 8:00 PM IST
బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!
X

పాన్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ లెక్కలు రోజురోజుకూ పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు రూ.100 కోట్లు సాధిస్తే పెద్ద విజయంగా చూసేవారు. ఇప్పుడు రూ.500 కోట్లు, రూ.1000 కోట్ల కలెక్షన్ల సాధిస్తేనే ఆ సినిమా గొప్ప అని ఫీల్ అవుతున్నారు. అది కాకుండా ఎంత త్వరగా సాధిస్తుంది అనే దాని పైన కూడా.. సినిమా సక్సెస్ బేస్ అవుతుంది.

ఈ విషయంలో తాజాగా రణబీర్ కపూర్ నటించిన రామాయణం పార్ట్ 1 అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తుంది. నవంబర్ 5, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం ఏడు రోజుల్లోనే ఇండియాలో రూ.500 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును దాటింది. అయితే ఈ జాబితాలో రణబీర్ కపూర్ రామాయణం కంటే ముందు రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ ఉంది. ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే రూ.500 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్లను సాధించింది. ఇక రామాయణం పార్ట్ 1 ఏడు రోజుల్లో రూ.511.10 కోట్ల ఇండియా నెట్ వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని అందుకోవడానికి ఒక్క రోజు దూరంలో నిలిచింది.

మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ హిందీ వెర్షన్ రూ.500 కోట్ల మార్కును చేరుకోవడానికి 11 రోజులు తీసుకుంది. ఆ సమయానికి హిందీలో రూ.552.10 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇక ఒరిజినల్ ధురంధర్ సినిమా ఈ మైలురాయిని అందుకోవడానికి 16 రోజులు పట్టింది. షారుఖ్ ఖాన్ జవాన్ 18 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాహుబలి 2 34 రోజులు తీసుకుంది. రణబీర్ కపూర్ యానిమల్ మాత్రం 39 రోజుల్లో ఈ మార్కును అందుకుంది. ప్రస్తుతం హిందీ బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా.. బాహుబలి, పుష్ప రికార్డు దాటేసి అందరినీ ఆశ్చర్యపరిస్తోంది.