'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయలేకపోయిన రామాయణం-1
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఏడు రోజుల్లో రూ.934 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, ఎనిమిదో రోజున మరో రూ.65 కోట్లు రాబట్టి రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరనుందని ట్రేడ్ అంచనా. ఈ మైలురాయిని 8 రోజుల్లో అందుకుంటే వేగంగా వెయ్యి కోట్లు సాధించిన రెండో సినిమాగా నిలుస్తుంది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కేవలం 6 రోజుల్లోనే ఈ రికార్డు సాధించింది.
By: Sivaji Kontham | 13 Nov 2026 8:15 AM ISTనితీష్ తివారీ దర్శకత్వం వహించిన `రామాయణం పార్ట్-1` రికార్డ్ స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లను సాధిస్తోంది. 7రోజుల్లో దాదాపు 934 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే మరో రూ. 65కోట్లు 8వ రోజు సులువుగా సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అంటే ఈ ప్రతిష్ఠాత్మక పురాణేతిహాసం 8 రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టబోతోంది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ సినిమా తక్కువ రోజుల్లో 1000కోట్ల క్లబ్ అందుకున్న టాప్-10 సినిమాల జాబితాలో రెండో స్థానంలో స్థిరపడనుంది. ఒకే ఒక్క సినిమా `రామాయణం`కి కూడా అందనంత ఎత్తులో ఉంది. అది ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2. పుష్పరాజ్ గా బన్ని అసాధారణ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏ రేంజులో పట్టంగట్టారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. `రామాయణం -1` చిత్రం 8రోజులలో సాధించిన ఫీట్ ని అంతకుముందే `పుష్ప 2` కేవలం 6 రోజుల్లోనే సాధించింది.
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం `రామాయణ: పార్ట్ 1` నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. కేవలం 8 రోజుల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్లో అడుగుపెట్టే దిశగా సాగుతోంది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న రెండో చిత్రంగా`రామాయణ` నిలవనుంది.
గతంలో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన ఇతర భారీ పాన్-ఇండియా చిత్రాల రికార్డులను పరిశీలిస్తే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి 2`, అలాగే 2026లో విడుదలైన `ధురంధర్ 2` చిత్రాలు 10 రోజుల్లో ఈ ఫీట్ సాధించగా... ప్రభాస్ `కల్కి 2898 ఏడీ` 11 రోజుల్లో వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకుంది. అదేవిధంగా రాజమౌళి దర్శకత్వం వహించిన `ఆర్ఆర్ఆర్` .. యశ్ నటించిన `కేజీఎఫ్: చాప్టర్ 2` చిత్రాలు 16 రోజుల సమయం తీసుకోగా... బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన `జవాన్`18 రోజుల్లో, `పఠాన్` 27 రోజుల్లో ఈ అరుదైన క్లబ్లో చేరాయి. ఇక భారీ అంచనాలతో వచ్చిన `కాంతార: చాప్టర్ 1`(కాంతార 2) దాదాపు రూ. 850-900 కోట్ల రేంజ్లో స్థిరపడి వెయ్యి కోట్ల మార్క్‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది.
ఇప్పుడు ఈ పాన్ ఇండియా హిట్లన్నిటినీ వెనక్కి నెడుతూ.. `రామాయణ: పార్ట్- 1` కేవలం 8 రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నార్త్ ఇండియాతో పాటు దక్షిణాది రాష్ట్రాలు.. ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే.. మునుముందు మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
