మండే రోజు రామాయణం మంటలు
‘రామాయణం’ సినిమా తొలి సోమవారం ఇండియాలో సుమారు రూ.95 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ‘ధురంధర్-2’ రూ.60 కోట్ల రికార్డును అధిగమించింది. బుక్‌మైషోలో గంటకు 1.31 లక్షల టికెట్లు అమ్ముడై ‘ధురంధర్-2’, ‘పుష్ప-2’ రికార్డులనూ బద్దలు కొట్టింది. అమెరికా వసూళ్ల పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
By: Garuda Media | 10 Nov 2026 7:41 PM ISTఎంత పెద్ద సినిమాకైనా సరే.. వీకెండ్ అయిపోయిందంటే వసూళ్లు తగ్గడం కామన్. సోమవారం పండుగ రోజైతే తప్ప కలెక్షన్లు స్టడీగా ఉండడం లేదా, పెరగడం జరగదు. కానీ నిన్న ‘రామాయణం’ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో ప్రభంజనం సృష్టించి ట్రేడ్ పండిట్లను విస్మయానికి గురి చేసింది. రిలీజ్ తర్వాత వచ్చే ఫస్ట్ మండే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘దురంధర్-2’ పేరు మీదున్న రికార్డును భారీ తేడాతో బద్దలు కొట్టేయడం విశేషం.
ధురంధర్-2 తొలి సోమవారం ఇండియాలో రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధిస్తే.. ‘రామాయణం’ రూ.95 కోట్ల మేర వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక సోమవారం యుఎస్‌లో అత్యధిక కలెక్షన్ తెచ్చిన సినిమా రికార్డు కూడా ‘ధురంధర్-2’ పేరిటే ఉండగా, ‘రామాయణం’ దాన్నీ వదిలిపెట్టలేదని సమాచారం. ‘దురంధర్-2’ ఫస్ట్ మండే 1.138 మిలియన్ డాలర్లు సాధిస్తే.. నిన్న ఉదయం 8 గంటల సమయానికే ‘రామాయణం’ 6 లక్షల డాలర్ల మార్కును దాటేసింది. సోమవారం కలెక్షన్ల పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కచ్చితంగా రికార్డు బద్దలవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. ‘బుక్ మై షో’లో నిన్న ‘రామాయణం’ సృష్టించిన ప్రభంజనం మరో ఎత్తు. ఈ టికెట్ బుకింగ్ యాప్‌లో ఒక గంటలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగానూ ‘రామాయణం’ ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. నిన్న ఉదయం నుంచే గంటకు లక్ష చొప్పున టికెట్లు అమ్మడం మొదలుపెట్టిన ‘రామాయణం’.. సాయంత్రానికి పీక్స్ అందుకుని ఒక దశలో గంటకు 1.31 లక్షల మేర టికెట్లు సేల్ చేయగలిగింది.
ఇక్కడ కూడా బద్దలైంది ‘దురంధర్-2’ రికార్డే. ఆ సినిమా 1.09 లక్షల టికెట్లతో రికార్డు నెలకొల్పింది. అంతకుముందు రికార్డు తెలుగు మూవీ ‘పుష్ప-2’ మీద ఉండడం విశేషం. ఆ చిత్రానికి పీక్స్‌లో గంటకు 1.07 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి ‘బుక్ మై షో’లో. వీకెండ్ అయిపోయాక, నాన్ హాలిడే రోజు ‘రామాయణం’ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యమే. ఈ సినిమా జనాల్లోకి ఎంతగా వెళ్లిపోయిందో చెప్పడానికి ఇది రుజువు. సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని, ఫైనల్ వసూళ్లు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయనడానికి ఈ నంబర్సే రుజువు.
