పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాంటి సినిమాలు వస్తే హిట్ అవుతున్నాయి...
పాన్ ఇండియా సినిమాల విజయానికి భారీ బడ్జెట్, యాక్షన్ మాత్రమే సరిపోవడం లేదు. అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ, బలమైన ఎమోషన్స్, ఆసక్తికరమైన స్క్రీన్ప్లే కీలకంగా మారుతున్నాయి. జానర్తో సంబంధం లేకుండా కథను ఆసక్తికరంగా, ఎక్కడా పట్టు కోల్పోకుండా తెరకెక్కిస్తేనే ప్రేక్షకుల ఆదరణతో పాటు బాక్సాఫీస్ విజయం దక్కుతోంది.
By: Gopi Velupala | 23 Nov 2026 11:16 AM ISTప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. కథలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగితే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టచ్చనే ఉద్దేశ్యంతో హీరోలు ముందుకు సాగుతున్నారు.
పాన్ ఇండియాలో సక్సెస్ సీక్రెట్ ఇదేనా...
స్టార్ హీరోలు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లను చేస్తున్నారు. అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధిస్తున్నాయి. దానికి తోడుగా కథ ఒక్క ప్రాంతానికో చెందినది కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా అందరిని కనెక్ట్ చేసేలా ఉంటే కథకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. మన హీరోలు చేస్తున్న యాక్షన్ సినిమాలకైతే బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా సినిమాలకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అలాగే డివోషనల్ థ్రిల్లర్ సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక మరికొన్ని సినిమాల విషయంలో మాత్రం జానర్ తో సంబంధం లేకుండా ఎంగేజింగ్ గా ఉండి ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ సినిమా ఈజీగా సక్సెస్ సాధిస్తుంది. సినిమా మొత్తం ఒక ఫ్లోలో ఉండి ఎక్కడా కూడా డివియేషన్స్ లేకుండా సినిమాలో ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారో దానిని స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేసిన ప్రతిసారి సక్సెస్ లను సాధిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో సైతం ఇదే ఫార్ములా నడుస్తుండడం విశేషం. స్టార్ హీరోల దగ్గర నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాల వైపే అడుగులు వేస్తున్నారు. అయిన కూడా వాళ్లందర్నీ మెప్పించడానికి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు...
స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తే హిట్ పక్కానా?
జానర్ తో సంబంధం లేకుండా కొన్ని కథలకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే రాసిన కూడా మూవీస్ సక్సెస్ లను సాధిస్తాయి. అందుకే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్క్రీన్ ప్లే తో వండర్స్ ను క్రియేట్ చేయగలిగితే భారీ సక్సెస్ లు వస్తాయి...
