Begin typing your search above and press return to search.

కింగ్ డమ్ టికెట్ బుకింగ్స్: గంటలోనే స్టన్నింగ్ రికార్డ్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్ డమ్’ సినిమా విడుదలతో టాలీవుడ్‌బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది.

By:  M Prashanth   |   31 July 2025 2:45 PM IST
Kingdom Storms Theatres: Vijay’s Comeback Begins!
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్ డమ్’ సినిమా విడుదలతో టాలీవుడ్‌బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ బజ్ కనిపించింది. ముఖ్యంగా ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. అభిమానులే కాకుండా యూత్‌లోనూ బాగా ఎక్సైట్­మెంట్ కనిపిస్తోంది. విడుదల రోజు టికెట్ బుకింగ్స్‌లో ఊహించని రెస్పాన్స్ ను అందుకుంటోంది.

ఎవరు ఊహించని రీతిలో కింగ్ డమ్ టికెట్లు అమ్ముడయ్యాయి. బుక్ మై షోలో ఒక గంటలోనే 14,300 టికెట్లు బుకింగ్ కావడం ఇండస్ట్రీలోనే ఓ రికార్డ్‌గా నిలిచింది. ఇది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బుకింగ్స్ స్పీడ్ చూసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాకు అటు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇటు నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లోనూ మంచి ఓపెనింగ్ వచ్చింది.

మరి సినిమా టాక్ ఎలా ఉందనేది చూస్తే, సోషల్ మీడియాలో మిక్స్డ్ టాక్ కనిపిస్తోంది. చాలా మంది విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్‌ని, సినిమాటోగ్రఫీని, అనిరుధ్ మ్యూజిక్‌ని ప్రశంసించారు. కానీ కథ అంత బలంగా లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ‘జెర్సీ’ రేంజ్‌కి గౌతమ్ తిన్ననూరి చేరలేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ సినిమా ఓ పక్క పాజిటివ్, ఇంకో పక్క నెగిటివ్ టాక్‌తో రన్ అవుతోంది.

అయితే బుకింగ్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. విడుదలకు ముందు భారీ అడ్వాన్స్ బుకింగ్స్, రిలీజైన రోజు గంటలోనే వేలు వేలు టికెట్లు అమ్ముడవడం చూస్తే విజయ్ దేవరకొండ మార్కెట్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ‘లైగర్’ తర్వాత వచ్చిన డిజాస్టర్‌ల తర్వాత, కమర్షియల్ గా కింగ్ డమ్ విజయ్ కి మంచి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓపెనింగ్ కలెక్షన్లు కూడా ఇప్పటికే పర్వాలేదు అనిపించేస్తున్నాయి.

కథలో కొత్తదనం లేకపోయినా, విజయ్ దేవరకొండ నటన, మాస్ సీన్లు, అనిరుధ్ బీజీఎమ్ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ బాగుందన్న టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. రెండో భాగంలో కథ పరంగా లోపాలు ఉన్నప్పటికీ, యాక్షన్ ఎలిమెంట్స్ ప్యాకేజింగ్ బాగుందని పలువురు చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కు సినిమా నచ్చేలా రూపొందించినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.