ENE-AOT : ఇది కదా అసలైన విజయం అంటే!
నవంబర్ అన్‌సీజన్ సెంటిమెంట్‌ను ‘ఈఎన్‌ఈ రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలు బ్రేక్ చేస్తున్నాయి. విడుదలైన వారంలోనే ‘ఈఎన్‌ఈ రిపీట్’ రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ కూడా రెండో వీకెండ్ నాటికి రూ.50 కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
By: Ramesh Palla | 27 Nov 2026 6:00 PM ISTఅనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా గెలుస్తారు... పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొట్టినప్పుడే చరిత్ర అవుతుంది. సినిమా ఇండస్ట్రీకి ఇది సరిగ్గా సూట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి సీజన్‌లో వచ్చిన సినిమాలు భారీ వసూళ్లు నమోదు చేస్తే పెద్ద కిక్ ఏమీ ఉండదు, కానీ అన్ సీజన్ అని పేరున్న నెలలో సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే అప్పుడు ఆ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. చాలా ఏళ్ల క్రితం నాగార్జున ఢమరుకం సినిమా నవంబర్‌లో విడుదల అయ్యి రూ.50 కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నవంబర్‌లో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఏ ఒక్క సినిమా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయాయి. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాం అనే నమ్మకంతో ఈ నగరానికి ఏమైంది 2, ఆకాశంలో ఒక తార సినిమాలు వచ్చి, సరికొత్త చరిత్ర ను సృష్టించాయి.
నవంబర్ నెలలో వచ్చిన సినిమాలు...
నవంబర్ నెలను అన్ సీజన్ నెలగా, బ్యాడ్ సెంటిమెంట్ నెలగా ఫిల్మ్ మేకర్స్ కొందరు భావిస్తారు. అందుకే నవంబర్ నెలలో పెద్ద సినిమాలు చాలా తక్కువగా రావడం మనం చూస్తూ ఉంటాం. మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు మాత్రమే ఈ నెలలో వస్తాయి. కానీ సెంటిమెంట్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈనెలలో తరుణ్ భాస్కర్ 'ఈఎన్‌ఈ రిపీట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈయన దర్శకత్వంలో ఎనిమిది ఏళ్ల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా ఈ రిపీట్ రూపొందింది. సీక్వెల్ కనుక పాజిటివ్ బజ్ ఉంది, తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ఉండటంతో నవంబర్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి మరీ విడుదల చేయడం జరిగింది. మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈఎన్‌ఈ రిపీట్ తో తరుణ్ భాస్కర్...
తరుణ్ భాస్కర్ మరోసారి యూత్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేయడంతో పాటు, నవ్వించాడనే టాక్ రావడంతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఆకాశంలో ఒక తార సినిమా బాక్సాఫీస్ వద్ద చాప కింద నీరులా మెల్లగా వెళ్తోంది. మొదటి వారం రోజుల్లో సినిమా రూ.25 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టింది. కానీ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్, వీక్ డేస్‌లో వచ్చిన వసూళ్ల నేపథ్యంలో ఈ వీకెండ్‌కి భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి కచ్చితంగా ఆకాశంలో ఒక తార సినిమా రూ.50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేస్తుందనే నమ్మకంను మేకర్స్, బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రెండో వారం వసూళ్లు తగ్గాలి. కానీ ఈ సినిమాకు మౌత్ టాక్ మెల్లగా విస్తరించడంతో వసూళ్లు రెండో వారంలో భారీగా ఉండబోతున్నాయి.
ఆకాశంలో ఒక తార సినిమాతో...
ఆకాశంలో ఒక తార సినిమా సైతం నవంబర్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి రూ.50 కోట్ల మార్క్‌ను టచ్ చేయబోతుంది. అన్ సీజన్ సమయంలో వచ్చి, బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, ఏళ్లకు ఏళ్లుగా ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేయడం ద్వారా ఈఎన్‌ఈ రిపీట్ సినిమాతో పాటు ఆకాశంలో ఒక తార నిజమైన హిట్‌ను సొంతం చేసుకున్నట్లు అయింది. వందల కోట్ల వసూళ్లు వచ్చిన కొన్ని సార్లు పెద్దగా సంతృప్తి అనిపించకపోవచ్చు. కానీ నవంబర్ లో సుదీర్ఘ కాలంగా ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేయడం ద్వారా ఈ రెండు సినిమాలకు అసలైన విజయం దక్కింది అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి వచ్చినప్పటికీ ఆకాశంలో ఒక తార సినిమా మెల్లగా జనాల్లోకి ఎక్కుతుంది. అందుకే వసూళ్ల విషయంలో ఈ రెండు సినిమాలకు క్లాష్ రాలేదు అనేది బాక్సాఫీస్ వర్గాల అభిప్రాయం.
