రెండో వారంలో 'ఆకాశంలో ఒక తార' మెరిసేది ఎంత?
‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు రెండో వీకెండ్‌లో వసూళ్లు పెరిగాయి. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్, వరుస ప్రమోషన్లు కలిసొచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తుండటంతో రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
By: Ramesh Palla | 29 Nov 2026 12:37 PM ISTదుల్కర్ సల్మాన్ హీరోగా సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా రూపొందిన 'ఆకాశంలో ఒక తార' సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి, కానీ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు అనేది మొదటి వారంలో వచ్చిన ఫిర్యాదు. చిత్ర యూనిట్ సభ్యులు నిరుత్సాహపడకుండా వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, పలు కార్యక్రమాలు నిర్వహించడం తో మెల్ల మెల్లగా వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. మౌత్ టాక్ సైతం పాజిటివ్‌గా ఉండటం, సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూడాలంటూ చాలా మంది చెబుతూ ఉండటంతో వసూళ్లు పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం మొదటి రోజు వసూళ్లతో పోల్చితే నిన్న, నేడు అంటే సెకండ్ వీకెండ్‌లో ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ రెండో వారంలో ఆకాశంలో ఒక తార సినిమా థియేటర్లకు క్యూ కట్టారని బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
అల్లు అరవింద్ సమర్పణలో ఆకాశంలో ఒక తార...
అల్లు అరవింద్‌తో పాటు చాలా మంది ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రాజమౌళి సైతం ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రచారం చేయడంతో పాటు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడం, సోషల్ మీడియాలో చాలా మంది పాజిటివ్‌గా స్పందించడంతో వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. మొదటి వారంలో రూ.50 కోట్లకు చేరని వసూళ్లు రెండో వారం పూర్తి అయ్యేప్పటికి కచ్చితంగా రూ.100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త సినిమాలు పెద్దగా సత్తా చాటలేక పోయాయి. ఈ వారం వచ్చిన సినిమాలు ఆకట్టుకోక పోవడం కూడా ఆకాశంలో ఒక తార సినిమాకు కలిసి వచ్చే అంశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండో వారం బాక్సాఫీస్ జోరు కనిపించబోతుంది.
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార కలెక్షన్స్...
మొదటి వీకెండ్‌లో వచ్చిన వసూళ్లతో పోల్చితే రెండో వీకెండ్ ఎక్కువ వసూళ్లు రావడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఆ మద్య హనుమాన్ అంశ్ సినిమాకు ఇలాగే జరిగింది. మరో రెండు మూడు సినిమాలకు సైతం ఇలా మెల్లగా వసూళ్లు పెరగడం జరిగింది. ఇప్పుడు ఆకాశంలో ఒక తార సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దిశగా దూసుకు పోతుంది. ఈ సినిమాతో వచ్చిన ఈఎన్‌ఈ రిపీట్ సినిమా జోరు కాస్త తగ్గింది. అది కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం అనడంలో సందేహం లేదు. మొత్తానికి ఈ వారం మొత్తం ఆకాశంలో ఒక తార మాదిరిగా ఈ సినిమా మెరవబోతుంది. దుల్కర్ సల్మాన్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకు పోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మీడియం రేంజ్ సినిమాగా మొదలైన ఈ సినిమాను ఇండస్ట్రీకి చెందిన పెద్దలు భుజాన ఎత్తుకోవడంతో పెద్ద సినిమా గా మారింది, ఇప్పుడు అదే స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి.
పవన్ సాదినేని దర్శకత్వంలో సినిమా...
ఒక సాధారణ అమ్మాయి జీవిత కథను తెరపై దర్శకుడు పవన్ సాదినేని ఆవిష్కరించిన తీరును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎంతో మంది మగవాళ్ళు హీరో పాత్రలో తమను తాము చూసుకుంటున్నారు. చాలా మంది అమ్మాయిలు సైతం కల్పన పాత్ర నుంచి స్ఫూర్తి పొందుతున్నామని అంటున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి రోజు రోజుకు మౌత్ టాక్ పాజిటివ్‌గా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో వచ్చే వారం కూడా ఇదే జోష్ కంటిన్యూ అయ్యి ఈజీగా రూ.100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కానీ, ఆ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకు కూడా అలాగే జరుగుతుందని అనుకున్నారు. కానీ ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల వల్ల రెండో వారంకు కలెక్షన్స్ పుంజుకున్నాయి. మూడో వారం వరకు కంటిన్యూ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్‌లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
