Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌కు ఆల్ట‌ర్నేట్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.. ?

బాపట్ల జిల్లా చీరాల మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాలు గెలవడం పార్టీకి కొంత ఊరటనిచ్చింది. ఈ విజయం ఆమంచి కృష్ణమోహన్ నాయకత్వంలోనే సాధ్యమైందని షర్మిల ప్రశంసించారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను బలోపేతం చేసే క్రమంలో షర్మిల స్థానంలో ఆమంచికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశంపై పార్టీలో చర్చ జరుగుతోంది.

By:  Garuda Media   |   10 Nov 2026 12:44 AM IST
ష‌ర్మిల‌కు ఆల్ట‌ర్నేట్‌.. కాంగ్రెస్‌లో హాట్ టాపిక్.. ?
X

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పున‌రుజ్జీవానికి బాప‌ట్ల జిల్లా చీరాల‌లో జ‌రిగిన మండ‌ల ప‌రిష‌త్‌.. ఎన్నిక‌లు దారి చూపాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు.. ఇక్క‌డ ద‌క్కించుకున్న విజ‌యం కొంత మేర‌కు కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చిం దని కూడా అంటున్నారు. తొలి ప్ర‌చారంలో 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తుది ఫ‌లితాలు వ‌చ్చే స‌రికి ఈ సంఖ్య 9గా మారింది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప‌రాజ‌యం పాలైనా.. చీరాల‌లో మాత్రం ఒకింత త‌లెత్తుకునే ప‌రిస్థితి నెల‌కొందన్న‌ది వాస్త‌వం.

ఈ విజ‌యం మొత్తం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సార‌థ్యంలోనే సాగింద‌న్న‌ది కూడా వాస్త‌వమేన‌ని పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల సైతం అంగీక‌రించారు. ఆయన‌ను ప్ర‌శంసించారు కూడా. ఇక‌, ఇప్పుడు మ‌రో అంశం కూడా పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీని వ్య‌క్తిగ‌తంగా ముందుకు న‌డిపించేందుకు , వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకునేలా చేసేందుకు.. ఆమంచి రూపంలో అండ దొరికింద‌ని అంటున్నారు. గ‌తంలో కూడా చీరాల నాయ‌కులు పార్టీని ముందుండి న‌డిపించిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

ఎలా సాధ్యం..?

ప్ర‌స్తుతం ష‌ర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్నారు. అయితే.. ఆమెకు రాజ్య‌స‌భ సీటు ఇస్తార‌న్న ప్ర‌చారం ఉంది. గ‌త రెండు మాసాల కింద‌టే ఆమె క‌ర్ణాట‌క కోటాలో పెద్ద‌ల స‌భ‌కు వెళ్లిపోవ‌డం ఖాయ‌మైంది. అయితే.. చివ‌రి నిమి షంలో ఆగిపోయింది. కానీ.. ఆమె ప్ర‌య‌త్నాలు మాత్రం ఆగిపోలేదు. ఈ ఏడాది కాక‌పోయినా.. వ‌చ్చే ఏడాది అయినా.. ష‌ర్మిల పెద్ద‌ల స‌భ‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇదేజ‌రిగితే.. రాష్ట్రంలో అధ్య‌క్షురాలిగా ఆమె ఉంటారా? లేక మార‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఉండ‌కూడ‌ద‌ని ఏమీ లేదు.

ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత‌గా ఉన్న మ‌ల్లికార్జున ఖ‌ర్గే జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా ఉన్నారు. కాబ‌ట్టి ష‌ర్మిల కొన‌సాగే అవ‌కాశం ఉంది. కాదూ కూడ‌దు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆమెస్థానంలో వేరే వారిని నియ‌మించాల్సి వ‌స్తే.. ఖ‌చ్చితంగా ఆమంచికి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని అంటున్నారు. తాజా ఫ‌లిత‌మే దీనికి గీటురాయిగా మారుతుం దని అంటున్నారు. గ‌తంలో ఒక‌ద‌ఫా కాంగ్రెస్ ప‌క్షాన ఆయ‌న విజ‌యంద‌క్కించుకోవ‌డం.. కాపు సామాజిక వ‌ర్గంలో మంచి పేరు ఉన్న నేప‌థ్యంలో ష‌ర్మిల‌కు ఆల్ట‌ర్నేట్‌గా ఆమంచి రాష్ట్ర చీఫ్ అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. మ‌రి గుర్రం ఎగురుతుందో లేదో చూడాలి.