Begin typing your search above and press return to search.

క్రాష్ టెస్టులో మారుతి కొత్త కారు అదరగొట్టేసింది

దీనికి బదులు చెప్పేలా.. ఇటీవల విడుదల చేసిన కారు ఒకటి క్రాష్ టెస్టులో అదరగొట్టిన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Garuda Media   |   27 Sept 2025 10:21 AM IST
క్రాష్ టెస్టులో మారుతి కొత్త కారు అదరగొట్టేసింది
X

దేశంలో అత్యధిక కార్లను అమ్మే దిగ్గజ సంస్థ మారుతి సుజుకి. దేశంలో ఈ సంస్థ ఉత్పత్తి చేసే కార్ల వాటా ఏకంగా 40 శాతం ఉండటం తెలిసిందే. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ గా.. ఏ వర్గానికి ఆ వర్గానికి సూట్ అయ్యే కార్లను ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేయటమే కాదు.. నిర్వహణ ఖర్చు మిగిలిన కార్లతో పోలిస్తే తక్కువన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. మారుతి సుజుకి అమ్మే కార్లలో ఎక్కువగా చిన్నకార్లే ఉంటాయి. అయితే.. క్రాష్ టెస్టుల్లో మారుతి కార్లకు సరైన రేటింగ్ ఉండదనే విమర్శ ఒకటి ఉంది.

దీనికి బదులు చెప్పేలా.. ఇటీవల విడుదల చేసిన కారు ఒకటి క్రాష్ టెస్టులో అదరగొట్టిన వైనం ఆసక్తికరంగా మారింది. మారుతి సుజుకి మార్కెట్లోకి కొత్తగా తెచ్చిన మోడల్ ‘‘ఇన్విక్టో’. ఈ కారుకు క్రాష్ టెస్టు నిర్వహించారు. భారత్ న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ను సాధించింది. దేశంలోని అత్యంత సురక్షిత కార్ల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది.

‘ఇన్విక్టో’ క్రాష్ టెస్టు ఫలితాల్ని చూస్తే..

- పెద్ద వయస్కుల ప్రయాణికుల రక్షణలో 32 పాయిట్లకు 30.4 పాయింట్లు స్కోర్ చేసింది.

- పిల్లల సేఫ్టీ విషయానికి వస్తే 49 పాయింట్లకు 45 పాయింట్లను సాధించింది.

- ఫ్రంటల్ ఆఫ్ సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్టులో 16పాయింట్లకు 14.43 పాయింట్లు సాధించింది.

- సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్టులో 16పాయింట్లకు 16 పాయింట్లు లభించాయి.

- సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.

క్రాష్ టెస్టుకు ఉపయోగించిన కారు 6 ఎయిర్ బ్యాగుల్ని కలిగి ఉందని చెబుతున్నారు. ఈ కారులో ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేకులు.. టైర్ ప్రెజర్ సిస్టం.. ఆటో హోల్డ్ తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.. ఏబీఎస్ విత్ ఈబీడీ.. హిల్ హోల్డ్ ఆసిస్ట్ తో పాటు త్రీపాయింట్ సీట్ బెల్టులు..ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్.. 360 డిగ్రీ వ్యూ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ కారు దేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచిందన్న మాట వినిపిస్తోంది.