Begin typing your search above and press return to search.

కార్ల మీద తాజా జీఎస్టీ ఎంత?

ఇదంతా ఓకే మోటారు వాహనాలు.. కార్ల సంగతేంటి? అన్న దానిపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది.

By:  Garuda Media   |   4 Sept 2025 9:37 AM IST
కార్ల మీద తాజా జీఎస్టీ ఎంత?
X

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ కొత్త శ్లాబుల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బుధవారం రాత్రి వేళ.. కాస్త ఆలస్యంగా కొత్త జీఎస్టీ శ్లాబుల మీద క్లారిటీ ఇస్తూ ప్రకటన చేశారు. నిత్యవసర వస్తువులు మొదలు ఒక పరిమితి వరకు ఇప్పటివరకు లగ్జరీగా భావిస్తున్న వస్తువులు.. వస్తుసేవలు సైతం చౌకగా మారనున్నాయి. ఇంటి నిర్మాణంలో అత్యంత కీలమైన సిమెంట్ మీదా ఇప్పటివరకు ఉన్న 28 శాతం పన్ను కాస్తా 18 శాతానికి తగ్గిపోవటం భారీ ఉపశమనంగా మారనుంది.

అంతేకాదు.. ఎలక్ట్ట్రానిక్ వస్తువుల మీదా పన్ను భారాన్ని తగ్గించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఉదాహరణకు 32 ఇంచ్ ల కంటే ఎక్కువ ఉండే టీవీల మీద ఇప్పటివరకు పన్ను భారం 28 శాతం కాగా.. అదిప్పుడు 18 శాతానికి తగ్గిపోయింది. ఇవే కాదు.. మోటారు వాహనాలు.. ఏసీలు.. డిష్ వాషర్లు.. ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ధరల భారం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోనుంది. ఉదాహరణకు ఒక్కో ఏసీ మీద తక్కువంటే రూ.4 వేల వరకు ధరాభారం తగ్గనుంది.

ఇదంతా ఓకే మోటారు వాహనాలు.. కార్ల సంగతేంటి? అన్న దానిపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది. ఎందుకుంటే..తాజాగా తగ్గిస్తారని భావించిన పన్ను తగ్గింపు కార్ల యజమానులు ఏ స్థాయి వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుందన్న విషయానికి వస్తే..

టూవీలర్ల విషయానికి వస్తే 350 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాటి వరకు ఇప్పటివరకు ఉన్న పన్ను 12 శాతానికి తగ్గిపోనుంది. కార్ల విషయానికి వస్తే 1200 సీసీకి మించని పెట్రోల్.. ఎల్ పీజీ.. సీఎన్ జీ వాహనాలకు ఇకపై జీఎస్టీ 18 శాతమే ఉండనుంది. అంటే.. ఇప్పుడు అమలైన దానితో పోలిస్తే పది శాతం తగ్గనుంది. అదే సమయంలో 1500 సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాల మీదా పన్ను భారం 18 శాతానికి తగ్గనుంది.

1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటారు వాహనాలు.. 3500 సీసీకి మించి సామర్త్యం ఉన్న టూవీలర్లు.. వ్యక్తిగత వినియోగానికి వాడే ఎయిర్ క్రాఫ్ట్ లు.. రేసింగ్ కార్లు.. క్యాసినోలు.. గ్యాంబ్లింగ్.. గుర్రపు పందాలు.. లాటరీలపై 40 శాతం పన్ను రేటు అమల్లోకి రానుంది.

ఇక.. అందరూ ఎంతో ఆసక్తిగా చూసిన ఎలక్ట్రిక్ కార్ల మీద ఇప్పటివరకు అమలవుతున్న 5 శాతం జీఎస్టీని కంటిన్యూ చేస్తారు. అంటే.. ఎలక్ట్రిక్ వాహనాల్ని మినహాయిస్తే.. మిగిలిన కార్లు (లగ్జరీ).. టూ వీలర్ల మీద పన్ను భారం పది శాతం తగ్గిపోయింది. అంటే.. 12 లక్షల రూపాయిలు ఉండే కార్ల మీద ఏకంగా రూ.లక్ష పైనే పన్ను భారం తగ్గిపోవటం గమనార్హం. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊతమిచ్చేలా చేస్తుందని చెబుతున్నారు.ఏమైనా.. తగ్గిన పన్నుల భారం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించటమే కాదు.. వ్యాపారులు సైతం తాము చేసే వ్యాపారాల్ని చట్టబద్ధంగా చేసేందుకు వీలుగా ప్రోత్సహించేలా తాజా నిర్ణయాలు ఉన్నాయని చెప్పాలి.