Begin typing your search above and press return to search.

2026 గురించి షాకింగ్ గా నోస్ట్రడమస్ అంచనాలు!

ఈ సమయంలో ప్రసిద్ధ ఫ్రెంచ్ ప్రవక్త నోస్ట్రడమస్ 500 ఏళ్ల నాటి అంచనాల్లోని పలు ముఖ్యాంశాలు తెరపైకి వచ్చాయి.. సంచలనంగా మారాయి.

By:  Raja Ch   |   27 Dec 2025 1:00 AM IST
2026 గురించి షాకింగ్ గా నోస్ట్రడమస్ అంచనాలు!
X

మరికొన్ని రోజుల్లో 2025 ముగియబోతోంది.. నూతన సంవత్సరంలోకి ప్రపంచం అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యలో రాబోయే సంవత్సరంలో తమ జీవితం ఎలా ఉంటుంది.. తమ ఆర్థిక పరిస్థితిలో వచ్చే మార్పులేమిటి.. వివాహం అవుతుందా.. ఉద్యోగం వస్తుందా.. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత ఇలాంటి రకరకాల వ్యక్తిగత విషయాలపై ఆసక్తి నెలకొనడం సహజమే! ఈ వ్యక్తిగత ఆలోచనల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ లోకానికి ఏమి జరగబోతుంది అనేది మరో అత్యంత కీలకమైన విషయం.

అవును... ఇప్పటికే నాలుగు యుద్ధాలు.. ఐదు సరిహద్దు ఘర్షణలు.. అణ్వాయుధాల పరీక్షలు.. సరికొత్త ఆయుధాల తయారీలు.. ఇంకో పక్క సీజన్ తో సంబంధం లేని వాతావరణ మార్పులు.. భూమిపై వడగళ్ల వానలు.. ఎడారుల్లో హిమపాతాలు.. వరుస భూకంపాలు.. అకాల వర్షాలు, భారీ వరదలు.. వెరసి ఎన్నో సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి! ఈ సమయంలో ప్రసిద్ధ ఫ్రెంచ్ ప్రవక్త నోస్ట్రడమస్ 500 ఏళ్ల నాటి అంచనాల్లోని పలు ముఖ్యాంశాలు తెరపైకి వచ్చాయి.. సంచలనంగా మారాయి.

సముద్ర యుద్ధం!:

నోస్ట్రడమస్ కవితలోని కొన్ని భాగాల ప్రకారం.. ఓడ మునిగిపోయే రోజు, సముద్రం శక్తి ప్రపంచ రాజకీయాలను మారుస్తుంది. ఈ క్రమంలో.. 2026లో ఓ పెద్ద నావికా లేదా సముద్ర సంఘటన ప్రపంచాన్ని కుదిపేస్తుంది.. ఓ భారీ ఓడ మునిగిపోవచ్చు.. లేదా, నావికా యుద్ధం ప్రారంభం కావచ్చు. ఈ నేపథ్యంలో ఓ దేశం వేసే తప్పటడుగు, తప్పు అడుగు వల్ల అకస్మాత్తుగా సముద్ర ఉద్రిక్తతలు పెరుగుతాయి.

మూడవ ప్రపంచ యుద్ధం!:

ప్రవక్త నోస్ట్రాడమస్ జోస్యం ప్రకారం.. 2026 మధ్యలో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావచ్చు. ఇది చాలా ప్రమాదకరమని నిరూపించబడుతుంది. ప్రధానంగా మతం, జాతీయవాదం పేరుతో ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు.

ఆర్థిక సంక్షోభం!:

నోస్ట్రాడమస్ తదుపరి జోస్యం.. 2026 సంవత్సరంలో యూఎస్, యూకే వంటి ప్రధాన దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతికి దారితీస్తుంది. ఈ క్రమంలో ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటారు. ఈ పెద్ద సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకుల పతనానికి దారితీయవచ్చు.

అణు దాడి!:

నోస్ట్రాడమస్ రాసిన మరో జోస్యం ప్రకారం.. 2026 లో జరిగే అణు దాడి జరిగే అవకాశం ఉంది. ఇది మానవ అంతరిక్ష కార్యక్రమాల పతనానికి దారితీసే అవకాశం ఉంది. ఒక ప్రధాన దేశం అణు దాడికి సిద్ధమవుతుంది.. అంగారక గ్రహం చీకటిలో మునిగిపోతుంది!

ప్రకృతి వైపరీత్యం!:

నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం.. 2026లో తీవ్రమైన వేడి అనేక ప్రాంతాలలో కరువుకు దారితీయవచ్చు. ఇదే సమయంలో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురువచ్చు.. ఫలితంగా వరదలు వస్తాయి. ఈ నేపథ్యంలో 2026ను వినాశన సంవత్సరంగా పరిగణిస్తారు! అధిక వర్షపాతం, నీటి మట్టాలు పెరగడం.. అటు పర్యావరణానికి, ఇటు ప్రజలకు గణనీయమైన నష్టాన్ని కలిగించే వినాశకరమైన వరదలు సంభవించడం జరగొచ్చు.

ఆహార ధాన్యాల ధరలు పెరగొచ్చు!:

నోస్ట్రాడమస్ చెప్పిన మరో జోస్యం ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ధాన్యం, గోదుమల ధరలు పెరగొచ్చు. ఈ పెరుగుదలకు రష్యా ఉక్రెయిన్ ఓడరేవులను దిగ్బంధించడం.. సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించడం కొంతవరకు కారణం కావొచ్చు. ఈ విధంగా... నోస్ట్రాడమస్ కవితలు నిర్దిష్ట తేదీలను ప్రస్తావించనప్పటికీ.. ఈ జోస్యాన్ని నమ్మే ప్రజలు వీటి గురించి చాలా ఆందోళన చెందుతున్నారు.