Begin typing your search above and press return to search.

మేనిఫెస్టోపై జ‌గ‌న్ ఎక్స‌ర్‌సైజ్‌.. ఈ సారి ఉచితాలు త‌క్కువేనా..?

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మే నెలకు ముందే పాదయాత్ర ప్రారంభించి కనీసం ఏడాదిన్నర పాటు ప్రజల్లో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. పాదయాత్రకు ముందే ప్రజల సమస్యలపై సర్వేలు చేయించి తాత్కాలిక మేనిఫెస్టో రూపొందించాలని యోచిస్తున్నారు. ఉచితాల కంటే ఉద్యోగాలు, పెట్టుబడులు, కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Garuda Media   |   29 Nov 2026 6:00 AM IST
మేనిఫెస్టోపై జ‌గ‌న్ ఎక్స‌ర్‌సైజ్‌.. ఈ సారి ఉచితాలు త‌క్కువేనా..?
X

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌క్కాప్లాన్ సిద్ధం చేస్తున్నారా? గెలుపు గుర్రం ఎక్కేందుకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. వ‌చ్చే ఏడాది చివ‌రిలో పాద‌యాత్ర చేయాల‌ని అనుకున్నా.. దీనిని మే నెల‌కు ముందే ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల్లో క‌నీసం ఏడాదిన్న‌ర‌పాటు ఉండాల‌న్న ల‌క్ష్యంతో జ‌గ‌న్ ఉన్నార‌ని చెబుతున్నారు.

ఇక‌, మ‌రో కీల‌క విష‌యం.. మేనిఫెస్టో. ఎన్నిక‌ల‌కు ముందు అన్ని పార్టీలు ప్ర‌క‌టించే ఈ మేనిఫెస్టోపై ఆస‌క్తి ఉం టుంది. మ‌రీ ముఖ్యంగా వైసీపీ మేనిఫెస్టోపై మ‌రింత ఎక్కువ‌గా ఇంట్ర‌స్ట్ క‌నిపిస్తుంది. ఉచితాలు స‌హా.. జాబ్ క్యాలెండ‌ర్‌.. వంటి ప‌థ‌కాల‌తో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఆక‌ట్టుకున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఈ మేనిఫెస్టో కార‌ణంగా కూడా మెజారిటీ ఓట్లు ప‌డ్డాయ‌ని అంటారు. పాద‌యాత్ర‌కు ఇది క‌లిసి వ‌చ్చింద‌ని చెబుతారు. ఇక‌, ఇప్పుడు కూడా మేనిఫెస్టోను అధిరిపోయే రీతిలోనే రెడీ చేయాల‌ని నిర్న‌యించిన‌ట్టు తెలుస్తోంది.

తాడేప‌ల్లి కార్యాల‌యం వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. పాద‌యాత్ర కంటే ముందుగానే.. టెంటేటివ్ మేనిఫెస్టో(తాత్కాలిక‌) త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే గ్రౌండ్ లెవిల్లో ఐఐటీ విద్యార్థుల‌తో స‌ర్వేలు చేయిస్తున్నారు. వీరు సేక‌రించిన స‌మాచారం ఆధారంగా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటికి అనుగుణంగానే మేనిఫెస్టోను రూపొందించేందుకు పార్టీ త‌ర‌ఫున స‌-న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. దీనికి గ‌తంలో పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసిన ఓ సీనియ‌ర్ మోస్ట్ జర్న‌లిస్టు నేతృత్వం వ‌హిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

ఉచితాల విష‌యంలో ఈ ద‌ఫా వైసీపీ వెనక్కిత‌గ్గే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వాటి స్థానంలో స్థిరాస్తులు, ఆదాయం పెంపు, ఉద్యోగాలు, పెట్టుబ‌డులు, ఆర్థికంగా రాష్ట్రాన్ని బ‌లోపేతం చేసే విష‌యా ల‌పై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 2019తో పోల్చుకుంటే మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు పెరిగారు. ఈ నేప‌థ్యంలో వారిని ఆక‌ర్షించేందుకు, ముఖ్యంగా మ‌హిళ‌ల ఓటును రాబ‌ట్టుకునేందుకు వీలుగా ఈ సారి మేనిఫెస్టోలో ఆర్థికంగా కుటుంబాలు పుంజుకునేందుకు వీలైన ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. అయితే.. అమ్మ ఒడి వంటి ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం తొలిద‌శ మేనిఫెస్టో ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయ‌ని అంటున్నారు.