ఎలా ఓడిపోయాం.. అధ్యయనం చేయించిన జగన్!
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలపై జగన్ రహస్య సర్వే చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు నిర్వహించిన ఈ సర్వేలో 111 మంది నియోజకవర్గ ఇన్‌చార్జిల నిర్లక్ష్యం, అధికార పార్టీతో రహస్య సంప్రదింపులు, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, అభ్యర్థులకు మద్దతు లేకపోవడం, హౌస్ అరెస్టుల ప్రచారం, నాయకులు క్షేత్రస్థాయిలోకి రాకపోవడం వంటి ఆరు కారణాలను గుర్తించినట్లు సమాచారం.
By: Garuda Media | 10 Nov 2026 10:42 AM ISTస్థానిక సంస్థలు సహా.. పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. ఇంటా బయటా కూడా భారీగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. పార్టీలోనూ ఈ విషయంపై పెను చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన అసలు ఓటమికి కారణాలపై అన్వేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లతో గత రెండు రోజులుగా రహస్య సర్వే చేయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ సర్వే పూర్తిగా పార్టీనాయకులపైనేనని అంటున్నారు.
ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన గ్రాడ్యుయేట్ల బృందం.. మూడు ప్రాంతాల్లో(సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర) పర్యటించి.. పార్టీ నాయకు లను కలుసుకుని వారి నుంచి అలాగే పోటీ చేసిన అబ్యర్థులు, ఓడిన వారు, గెలిచిన వారిని కూడా కలుసుకుని వారి నుంచి కూడా సమాచారం సేకరించినట్టు తెలిసింది. మొత్తంగా ఈ సర్వేలో ఆరు కీలక కారణాలను ఈ బృందం సేకరించిందని అంటున్నారు. వైసీపీ రాజకీయ పరిస్థితులపై ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు విశ్లేషణ చేసి జగన్‌కు రహస్య నివేదిక అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నివేదికలో ప్రస్తావించిన పలు అంశాలు.. సంచలనంగా మారాయి.
వైసీపీ ఓటమికి 6 ప్రధాన కారణాలు!
1) 111 మంది నియోజకవర్గ ఇన్‌చార్జిల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలను తేలిగ్గా తీసుకున్నారని సర్వే స్పష్టం చేసింది.
2) అధికార పార్టీతో రహస్య సంప్రదింపులు జరిపారని, రాత్రి 8-12 గంటల మధ్య అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని స్థానిక కేడర్ నుంచి సమాచారం ఉందని బృందం పేర్కొంది.
3) సినిమా స్టైల్ ప్రచారం చేశారే తప్ప.. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని సర్వే స్పష్టం చేసింది. ప్రచార హంగామా, డ్రామాలకే ప్రాధాన్యత ఇచ్చారని బృందం పేర్కొంది.
4) అభ్యర్థులకు అండ లేకపోవడం కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన డ్రా బ్యాక్‌గా మారిందని పేర్కొన్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు అవసరమైన మద్దతు, ధైర్యం కల్పించకపోవడంతోనే వారు నైతికంగా ఇబ్బంది పడ్డారని పేర్కొంది.
5) అరెస్టులు, హౌస్ అరెస్టుల డ్రామాలు కూడా ఉద్దేశపూర్వకమేనన్నారు. సెల్ఫీ వీడియోలు, హౌస్ అరెస్టుల ప్రచారానికే పరిమితం కావడం కూడా పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని ఐఐటీ బృందం స్పష్టం చేసింది.
6) నాయకులు రోడ్డు మీదకు రాకపోవడం కూడా ప్రధానంగా దెబ్బేసిందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు స్వయంగా పోరాటం చేయకుండా కార్యకర్తలతోనే ధర్నాలు చేయించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లో పట్టు పోయిందని తేల్చారు. మరీ ముఖ్యంగా 111 మంది నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరును సమీక్షించి అవసరమైన మార్పులు చేయకపోతే, 2029 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి భారీ రాజకీయ నష్టం తప్పదని ఆ నివేదికలో హెచ్చరించినట్లు సమాచారం.
