Begin typing your search above and press return to search.

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

విజయసాయిరెడ్డి కొత్తగా పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) ఏర్పాటు చేయడంపై వైసీపీ తొలిసారి స్పందించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరోక్షంగా స్పందిస్తూ.. జగన్ మద్దతు ఉంటేనే కొందరికి రాజకీయ గుర్తింపు ఉంటుందని, ఆయన లేకపోతే వారి ప్రభావం శూన్యమని వ్యాఖ్యానించారు.

By:  Satya P   |   12 Nov 2026 11:50 PM IST
జగన్ లేకపోతే  ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !
X

పరమ శివుడి మెడలో ఉన్నంతవరకే పాము నాగాభరణం అన్నది పురాణం సామెత. అలా జగన్ తో ఉంటేనే ఎవరైనా రాజకీయంగా వెలిగేది. ఆయనను కాదని బయటకు వెళ్తే జీరో అని ఆ పార్టీ అంటోంది. ఇపుడు ఇదంతా ఎందుకు అంటే వైసీపీలో నంబర్ టూగా ఒకనాడు వెలిగిన మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఏపీలో కొత్తగా పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు పరివర్తన రాజనీతి పార్టీ. విజయవాడలో ఆయన తన పార్టీ పేరుని జెండాను అజెండాను కూడా ప్రకటించారు. అయితే ఆ పార్టీ మీద వైసీపీ ఒక రోజు అంతా సైలెంట్ ఉంది. ఇక కాస్తా లేట్ గా అయినా లేటెస్ట్ గానే వైసీపీ తన ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది. విజయసాయిరెడ్డిని ఆయన పార్టీని ఏమీ కారు అని లైట్ తీసుకుంటూ ఈ స్పందన ఉంది.

చెవిరెడ్డి కామెంట్స్ :

ఇక విజయసాయిరెడ్డి పీఆర్పీ గురించి వ్యాఖ్యానించే బాధ్యతను మాజీ ఎమ్మెల్యే జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద పెట్టినట్లుగా ఉంది. అయితే ఆయన ఎక్కువ వ్యాఖ్యానం చేయకుండానే సింపుల్ గా తేల్చేశారు. ఆయన చెప్పిన దాంట్లో చూస్తే జగన్ అనే బలమైన మద్దతు ఉన్నప్పుడు కొందరు అంటే విజయసాయిరెడ్డి అన్న మాట. మను తాము చాలా గొప్పవారిగా ఊహించుకుంటారు. జగన్ పట్ల ఉన్న నమ్మకం ఆయనకు ఉన్న విశ్వసనీయత వల్లే వారికి సైతం ఒక రాజకీయ వేదిక దొరుకుతుంది, అయితే దీనిని చూసి వారు తమ స్థాయి కంటే తాము ఎంతో గొప్పవారమని భ్రమపడుతుంటారు. కానీ జగన్ లేకపోతే తమకు ఏమీ లేదనే వాస్తవం వారికి అర్థం కావడం లేదు అంటూ పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఆ విధంగా ఆయన అంటూ ఎలాంటి ప్రాముఖ్యత లేని పార్టీల వల్ల వైసిపి మీద ఎటువంటి ప్రభావం ఉండదని తేల్చేశారు.

పేరు పెట్టకుండానే :

దీనిని బట్టి వైసీపీ విజయసాయిరెడ్డిని ఆయన పెట్టిన కొత్త పార్టీని ఎంత లైట్ తీసుకుందో అర్ధం అవుతోంది అంటున్నారు. ఎక్కడా విజయసాయిరెడ్డి పేరు కానీ ఆయన పార్టీ పేరు కానీ ప్రస్తావించకుండా జగన్ లేకపోతే ఎవరూ గొప్ప వారు కారు అని చెవిరెడ్డి ద్వారా చెప్పించింది అని అంటున్నారు. అంతే కాదు తమను తాము గొప్పగా ఊహించుకుంటూ ఆ భ్రమలలో ఉంటారు అని కూడా పేర్కొంటోంది. ఒక విధంగా సాయిరెడ్డి పీఆర్పీని ఫుల్ లైట్ గానే వైసీపీ తీసుకుంది అని అంటున్నారు. ఎంతలా అంటే విజయసాయిరెడ్డి పేరు కూడా తలవనంతగా అని గుర్తు చేస్తున్నారు.

మూడు తరాల బంధం :

విజయసాయిరెడ్డి విషయానికి వస్తే వైఎస్ కుటుంబంతో మూడు తరాల బంధం ఆయనది. జగన్ తాత రాజారెడ్డి నుంచి వైఎస్సార్ నుంచి జగన్ దాకా ఆయన నడిచారు. అలా తన ప్రస్తానాన్ని కొనసాగించారు. వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడైన చార్టర్డ్ అకౌంటెంట్ గా అలాగే తరువాత కాలంలో వైసీపీలో రాజకీయ నాయకుడుగా విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే ఆయన వైసీపీని వైఎస్ ఫ్యామిలీని కూడా వీడి బయటకు వచ్చేశారు. ఆయన ఇపుడు తన రాజకీయ అస్థిత్వం కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ నీడ నుంచి బయటపడి తానూ సొంతంగా వెలగాలన్న ఆరాటం ఆయనలో కనిపించిది.

జగన్ నే టార్గెట్ గా :

ఈ క్రమంలో ఆయన జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఆచరిస్తున్న క్రైస్తవ మతాన్ని గుర్తు చేస్తూ అలా వేరే మతంలో ఉన్న వారు రెడ్డి సామాజికవర్గం మద్దతును మాత్రం స్వార్థంతో వాడుకుంటున్నారు అంటూ ఇండైరెక్ట్ గానే ఘాటు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ఈ ఫస్ట్ రియాక్షన్ వచ్చింది అన్న మాట. అంతకంటే ఎక్కువ ఆయన గురించి వద్దు అని అనుకున్నారేమో అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డిని లైట్ తీసుకుంటే ముందు ముందు ఆయన ఏ విధంగా తన ప్రభావం చూపిస్తారో అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిలను మొదట్లో లైట్ గా తీసుకున్నారు. ఆమె 2024 ఎన్నికల్లో వైసీపీని టార్గెట్ చేసి ఆ పార్టీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమలో గట్టి దెబ్బ తీసింది అని గుర్తు చేస్తున్నారు.