Begin typing your search above and press return to search.

జగన్ అరెస్ట్ అవుతారా... పులివెందుల ఒక సంచలనం ?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు అయింది.

By:  Satya P   |   31 Oct 2026 7:00 PM IST
జగన్ అరెస్ట్ అవుతారా... పులివెందుల ఒక సంచలనం ?
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు అయింది. ఆయన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కుని ఉపయోగించు కోవడానికి పులివెందులకు ఆదివరం రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం పులివెందుల చేరుకోనున్న వైయస్‌ జగన్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం సాయంత్రం పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే జగన్ పులివెందులలో తాను పోలింగ్ రోజు ఉంటాను అని చెప్పారు. తాజాగా పులివెందుల పర్యటనలో జగన్ చొక్కా మడత పెట్టి ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ చేశారు. పోలింగ్ రోజు తాను పులివెందులలో ఉంటాను అని కూడా చెప్పారు. దాంతో పోలింగ్ రోజుల పులివెందులలో ఏమి జరుగుతుంది అన్నది చర్చగా ఉంది.

ఓటు వేసి వెళ్ళిపోవాలి :

ఇదిల ఉంటే పులివెందులలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. జగన్‌ పులివెందుల నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారని అందువల్ల ఆయనకు తన ఓటు హక్కును వినియోగించుకునే పూర్తి హక్కు ఉందని డీఐజీ తెలిపారు. అదే సమయంలో ఎన్నికల నిబంధనలను ఆయన పాటించాలని కోరారు. ఎన్నికల నియమావళి ప్రకారం చూస్తే కనుక జగన్ తన ఓటు ఉన్న పోలింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

పర్యటనకు నో పర్మిషన్:

అదే సమయంలో జగన్ పులివెందులలో పర్యటిస్తాను అంటే అనుమతి లేదని కోయ ప్రవీణ్ చెప్పారు. జగన్ తన ఓటు వేసిన తర్వాత పులివెందుల పట్టణంలో తిరగడానికి లేదా ఇతర పోలింగ్ కేంద్రాలను సందర్శించడానికి అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. జగన్ తన ఓటు వేసి నేరుగా వెళ్లిపోవాలని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. జగన్ కి ఒక ఓటరుగా మాత్రమే పూర్తి భద్రత ఏర్పాటు చేస్తామని కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. దీంతో ఇపుడు డీఐజీ వ్యాఖ్యల నేపథ్యంలో పోలింగ్ రోజు ఏమి జరగనుంది అన్నది చర్చగా ఉంది.

పర్యటిస్తారా :

అయితే జగన్ పులివెందులకు ఉదయాన్నే రావడం లేదు, మధ్యాహ్నం వస్తున్నారు. ఆ సమయానికి సగం పోలింగ్ పూర్తి అవుతుంది. ఇక జగన్ తన ఓటు వేసిన తరువాత పోలింగ్ సరళి గురించి వాకబు చేస్తారా అలాగే ఆయన పోలింగ్ బూత్ లలో పర్యటన పెట్టుకుంటారా అన్నది చర్చగా ఉంది. జగన్ కనుక అలా చేయడానికి ప్రయత్నిస్తే అనుమతించమని పోలీసులు గట్టిగా చెబుతున్నారు. జగన్ అయితే ఇప్పటికే ఒక సవాల్ చేశారు. తాను పోలింగ్ రోజు పులివెందులలోనే ఉంటాను అని. ఆయన క్యాడర్ కి నైతిక ధైర్యాన్ని ఇవ్వడానికి అలా అని ఉంటే ఓటు వేసి తన ఇంటికి వెళ్ళి మొత్తం అక్కడ నుంచి పర్యవేక్షించ వచ్చు అంటున్నారు.

హాట్ హాట్ చర్చగా :

అలా కాకుండా ఇతర పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్తేనే పోలీసులు అనుమతించరు అంటున్నారు. మరి అదే కనుక జరిగితే జగన్ ని అరెస్ట్ చేస్తారా అలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయా అన్నది ఇపుడు హాట్ హాట్ చర్చగా ఉంది. జగన్ మాజీ ముఖ్యమంత్రి అని ఆయనకు పోలింగ్ రోజు నాయకులు ఎవరూ పర్యటించకూడదు అన్నది తెలుసు అని కోయ ప్రవీణ్ అంటున్నారు. జగన్ ఓటు వేసి తన నివాసానికి వెళ్లిపోతే ఇష్యూ లేదు కానీ లేకపోతే మాత్రం పోలింగ్ రోజున పులివెందుల ఒక సంచలనం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా చూడాలంటున్నారు.