Begin typing your search above and press return to search.

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వైసీపీని ప్రక్షాళన చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. షర్మిల వ్యవహారంపై పార్టీ నేతలు స్పందించకూడదని, పనితీరు బాగోలేని 40 నుంచి 80 మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి-ఫిబ్రవరిలో నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.

By:  Garuda Media   |   19 Nov 2026 5:00 PM IST
వైసీపీలో మూడు నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!
X

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌థ్య‌మ‌ని.. మార్పు వ‌స్తుంద‌ని పెద్ద ఎత్తున అంచ‌నాలు వేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కొంత మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా వైసీపీలో మూడు నియ‌మాల‌ను ఆయ‌న ప్ర‌తిపా దించార‌ని తెలిసింది. ఒక ఓట‌మి త‌ర్వాత‌.. మార్పు స‌హ‌జంగానే వ‌స్తుంది. అయితే.. దీనిని ఒప్పుకోక‌ పోవ‌డంలోనే అస‌లైన ఓట‌మి కూడా ఉంటుంది. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలోత‌న ఓట‌మిని దాదాపు జ‌గ‌న్ అంగీక‌రించ‌లేదు. కానీ, స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఎదురు దాడి చేసే ప్ర‌య‌త్నం చేసినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం పార్టీ ఓట‌మిని ఆయ‌న అంగీక‌రించారు.

ఈ క్ర‌మంలోనూ పార్టీ నాయ‌కులు, కార్య‌ క‌ర్త‌ల‌కు మూడు నియ‌మాల‌ను సూచించారని తెలిసింది. వీటిని అంద‌రూ ఖ‌చ్చితంగా పాటించాలని జ‌గ‌న్ చెప్పార‌ని ఓ సీనియ‌ర్ నేత వెల్ల‌డించారు. అంత‌ర్గ‌త స‌మాచారం మేర‌కు..

1) త‌న సోద‌రి ష‌ర్మిల విష‌యంపై ఎవ‌రూ స్పందించ‌ వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. ఇప్ప‌టికే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్ కార‌ణంగా పార్టీపై ప‌డుతున్న ప్ర‌భావాన్ని సీనియ‌ర్లు ఆయ‌న‌కు వివ‌రించారు. దీంతో "మీరు ఎవ‌రూ మా విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌ద్దు" అని జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. త‌ద్వారా ష‌ర్మిల విష‌యంతో వ‌స్తున్న మైన‌స్‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

2) పనితీరు ఆధారంగా ఇన్‌ఛార్జీల మార్పు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పనితీరు సరిగా లేని 40 నుండి 80 మంది ఇన్‌ఛార్జీలను తొలగించి, కొత్త వారికి బాధ్యతలు అప్పగించే అంశాన్ని జగన్ పరిశీలించార‌ని తెలిసింది. ప్ర‌ధానంగా స్థానిక స‌మ‌రంలో ప్ర‌చారానికి బ‌దులుగా సెల్ఫీ వీడియోలకు పరిమితమైన వారిపై ఆగ్ర‌హంతో ఉన్నార ని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని జగన్ గతంలోనే స్పష్టం చేసినా నాయ‌కులు చేతులు ఎత్తేయ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

3) జ‌గ‌న్ కంటే ముందే.. వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌రు-అక్టోబ‌రులో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. త‌ద్వారా పార్టీని మ‌రోసారి అధికారంలోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. దీనికంటే ముందే.. అంటే.. వ‌చ్చే జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య జిల్లాల వారీగా నియోజ‌క‌ వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయి నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు తెలిసింది. అదేవిధంగా భారీ ప్రక్షాళనలో భాగంగా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే కొత్త ముఖాలకు, యువ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని జగన్ సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా జ‌న్‌జీకి అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.