పాదయాత్రకు జగన్ తొందర...రీజన్ అదేనా ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రను ఆరు నెలల ముందుకు జరపనున్నారనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తొలుత 2027 అక్టోబర్, నవంబర్‌లో పాదయాత్ర చేపడతారని భావించినా, ఇప్పుడు మార్చి నుంచే ప్రారంభించవచ్చని చర్చ సాగుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పులు, 2028లో జమిలి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
By: Satya P | 18 Nov 2026 9:05 AM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఏపీలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దాని కోసం తమ పార్టీకి కలసి వచ్చిన ఆయుధం, వైఎస్సార్ ఫ్యామిలీకి అతి పెద్ద సెంటిమెంట్ గా ఉన్న పాదయాత్రను ఎంచుకున్నారు. మరోసారి కాళ్ళకు పని చెప్పడం ద్వారా అధికార పీఠానికి చేరువ కావచ్చు అన్నది జగన్ వ్యూహంగా ఉంది. అయితే జగన్ పాదయాత్ర ఎపుడు చేపడతారు అన్నది అయితే పార్టీ వర్గాలకే ఇప్పటిదాకా తెలియదు. కానీ జగన్ పదే పదే పార్టీ సమావేశాలలో చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక వచ్చే ఏడాది అక్టోబర్ నవంబర్ లలో ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఇప్పటికి సరిగ్గా ఏడాది కాలం తరువాత అన్న మాట. దానికి ఇంకా బోలెడు సమయం ఉంది అని అంతా అనుకుంటున్న వేళ మరో ప్రచారం అయితే ఇపుడు గట్టిగా వినిపిస్తోంది.
ఆరు నెలల ముందుకు :
జగన్ పాదయాత్ర ఆరు నెలల ముందుకు జగన్ జరుపుతున్నారు అని అంటున్నారు. సడెన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. అయితే వైసీపీ వర్గాల నుంచి అయితే దీని మీద కూడా ఏమీ సమాచారం లేకపోయినా ప్రచారం చూస్తే జగన్ వచ్చే ఏడాది మార్చి నుంచి పాదయాత్రకు సిద్ధపడుతారు అన్నది అయితే బయటకు వస్తోంది. 2027 మార్చి తరువాత జగన్ పాదయాత్ర గానే జనంలోకి వెళ్తారు అని అంటున్నారు.
ఇంచార్జిల నియామకం :
పాదయాత్రను ముందుకు జరపడంతోనే ఏపీలో చాలా చోట్ల నియోజకవర్గాల ఇంచార్జిలను జగన్ మార్చోబోతున్నారు అని కూడా అంటున్నారు. పని తీరు సరిగ్గా లేని వారిని మార్చేసి ఆ ప్లేస్ లో ఉత్సాహవంతులను నియమించాలని జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక వీరి పనితీరుని కూడా పాదయాత్రలో గమనించడమే కాకుండా తన పాదయాత్రకు అవసరమైనవి అన్నీ చూసేందుకు గట్టి నాయకులు ఉండాలని ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇది ఒక కారణం అయితే మరో కీలకమైన కారణం కూడా జగన్ పాదయాత్ర ముందుకు తేవడానికి ఉంది అని అంటున్నారు.
జమిలి ఎన్నికలు అంటూ :
ఇక దేశంలో ఎన్నికలు 2029 మేలో జరుగుతాయని అలాగే ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు దానితో పాటే జరుగుతాయని అంతా అనుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే అదే కరెక్ట్ కూడా. కానీ రాజకీయాలు చూస్తే జాతీయ స్థాయిలో వేగంగా మారిపోతున్నాయని అంటున్నారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒకేసారి జమిలి అన్నది కుదిరే వ్యవహారం కాదు కానీ అందులో సగం రాష్ట్రాలలో మినీ జమిలి ఎన్నికలను నిర్వహించాలని చూస్తోంది అని అంటున్నారు. అలా చూసుకుంటే లోక్ సభ పదవీ కాలం ఆరు నెలలు కుదించుకుని మరీ 2028 చివరిలో ఎన్నికలు పెడతారు అని ప్రచారంలో ఉంది అని అంటున్నారు.
వైసీపీ జోరు :
మరి జగన్ పాదయాత్ర కూడా ఆరు నెలల ముందుకు తోసుకుని వస్తోంది అని జరుగుతున్న ప్రచారం కూడా ఈ జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా 2028 లో జమిలి జరిగితే ఏపీలో కూడా అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయి. దాంతో 2027 మార్చిలో పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఏపీ మొత్తం తిరగడానికి సమయం సరిపోతుంది అని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ఊహాగానాలు ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సిందే.
