Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

ఏపీ స్థానిక, పరిషత్ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే పుంజుకుందని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమర్థించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, సమన్వయ లోపాలు, నాయకుల మధ్య సహకారం వంటి అంశాలపై సమీక్ష చేయాలని ఓడిన నేతలు కోరుతున్నారు.

By:  Garuda Media   |   12 Nov 2026 6:00 PM IST
చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !
X

రాష్ట్రంలో కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న బీజేపీ స్థానిక, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో చూపిన `పోరాట ప‌టిమ‌` విషయంపై రాజ‌మండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ అధ్య‌క్షు రాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌.. స‌మ‌ర్థించు కున్నారు. అంతా బాగుంద‌ని.. గ‌తం కంటే కూడా.. పార్టీ పుంజుకుంద‌ని అన్నారు. క్షేత్ర‌స్థాయిలో పార్టీకి మంచి మార్కులు వ‌చ్చాయ‌ని కితాబిచ్చుకున్నారు. రాజ‌మండ్రి నియోజ‌కవ‌ర్గం ప‌రిధిలో విజ‌యం ద‌క్కించుకున్న కొంద‌రు నాయ‌కుల‌కు ఘ‌న స‌న్మానం చేసుకున్నారు.

క‌ట్ చేస్తే.. పురందేశ్వ‌రి చెప్పిన‌ట్టుగా బీజేపీ ప‌రిస్థితి అంతా బాగున్న‌ట్టేనా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. బీజేపీ ఎమ్మెల్యేలు సార‌థ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా.. క‌మ‌లం పార్టీత‌ర‌ఫున పోటీ చేసిన నాయ‌కులు.. ప‌రాజ‌యం పాల‌య్యారు. ముఖ్యంగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్రం స్థాయిలో మంచి ప‌లుకుబ‌డి ఉన్న మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ధ‌ర్మవ‌రం నుంచి ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం ఉన్న తిరుప‌తిలో త‌ర‌చుగా గ‌ళం వినిపించే నాయ‌కులు కూడా.. ఈ ఎన్నిక‌ల్లో విఫ‌ల‌మ‌య్యారు.

ఈ ప‌రిణామాలు.. క్షేత్ర‌స్థాయిలో క‌మ‌ల నాథుల‌ను డీలా ప‌డేశాయ‌న‌డంలో సందేహం లేదు. అయినా.. కూడా గ‌తంలో బీజేపీ పెద్దలు చెప్పిన‌ట్టుగానే క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు.. ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌కుండా.. పురందే శ్వ‌రి స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నిజానికి స్థానిక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన నాయ‌కులు ఉత్త‌రాంధ్ర‌లోనే ప‌రాజ‌యం పాల‌య్యారు. జిల్లాల‌కు బీజేపీ అధ్య‌క్షులుగా ప‌నిచేసిన వారు కూడా ఈ ఎన్నిక‌ల్లో తిరుగు ట‌పా క‌ట్టారు. మ‌రి ఈ ప‌రిస్థితుల‌కు కార‌ణాలు వెతికే ప‌నిచేయ‌కుండానే చిన్న‌మ్మ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తమైంది.

త‌ప్పులు ఎక్క‌డ‌..?

ఎన్నిక‌ల రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు కామ‌నే. కానీ, పార్టీ పుంజుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు.. అస‌లు త‌ప్పులు ఎక్క‌డ జ‌రిగాయ‌న్న‌ది తెలుసుకోవాల్సిన బాధ్య‌త పార్టీనేత‌ల‌పై ఉంటుంది. పైగా సుదీర్ఘ‌రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చిన్న‌మ్మ‌వంటి వారు ఈ విష‌యంపై దృష్టి పెట్టాలి. కానీ, అలా చేయ‌లేదు. పైగా అంతా బాగుంద‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. మ‌రోవైపు.. ఓడిన నాయ‌కులు.. త‌ల ప‌ట్టుకుంటున్నారు. దీనికి కార‌ణాలేంట‌నేది అన్వేషించా ల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో స‌మ‌న్వ‌య లోపం.. పార్టీలో విచ్చ‌ల‌విడి స్వ‌తంత్రం.. అభ్య‌ర్థుల ఎంపిక‌, వారికి స‌హ‌కారం వంటి విష‌యంలో జ‌రిగిన తీవ్ర‌మైన లోటుపాట్ల‌ను స‌రిచేసుకోక‌పోతే.. క‌ష్ట‌మ‌నే వాద‌న ఉంది. మ‌రి ఈ విష‌యాన్ని చిన్న‌మ్మ లైట్ తీసుకున్నారా? అనేది ముఖ్యం.