Begin typing your search above and press return to search.

వైసీపీ బోణీ కొడుతుందా ?

శ్రీకాకుళం కార్పొరేషన్ తొలి మేయర్ ఎన్నిక గురువారం జరగనుంది. 60 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కూటమి తరఫున జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇరుపక్షాలు హోరాహోరీగా ప్రచారం చేయడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నెల 30న ఫలితాలు వెలువడనున్నాయి.

By:  Satya P   |   25 Nov 2026 11:24 PM IST
వైసీపీ బోణీ కొడుతుందా ?
X

శ్రీకాకుళం మేయర్ ఎన్నిక గురువారం జరగనుంది. శ్రీకాకుళం మునిసిపాలిటీ నుంచి కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ అయ్యాక జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. దాంతో సిక్కోలు నగర పాలక సంస్థకు తొలి మేయర్ ఎవరు అవుతారు అన్నది ఉత్కంఠగా ఉంది. మామూలుగా అయితే కూటమిదే పై చేయి అనుకోవాలి. కానీ వైసీపీ కూడా ధీటుగా నిలబడి గట్టి పోటీ ఇచ్చింది.

పైపెచ్చు చూస్తే మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దేవి మేయర్ అభ్యర్ధిగా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి లేరు, కూటమి నుంచి పొత్తులలో భాగంగా జనసేన అభ్యర్థి మేయర్ సీటును అందుకుని పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి కొత్తవారు కావడం వైసీపీ మేయర్ అభ్యర్ధికి అనుభవం ఉండడంతో పాటు శ్రీకాకుళం నగరం అంతటా గుండ కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్నీ కలిసి వైసీపీకి కొంత ఎడ్జ్ ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి.

కూటమిలో లుకలుకలను వైసీపీ వినియోగించుకోవాలని ప్రయత్నాలు కూడా చేసింది. వైసీపీ కూటమి ఎవరూ తగ్గకుండా ప్రచారం పర్వం కొనసాగించారు. దాంతో శ్రీకాకుళం ప్రజలు తమ మేయర్ గా ఎవరిని ఎన్నుకుంటారు అన్నది అయితే ఆసక్తిని రేపుతోంది.

వైసీపీకి శ్రీకాకుళం జిల్లాలో 2024 ఫలితాలతో పాటు తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా చేదునే మిగిల్చాయి. అందుకే అన్నింటికీ ఒకే జవాబు అన్నట్లుగా కార్పోరేషన్ నే గెలిచి తమ సత్తా చాటాలని వైసీపీ చూస్తోంది. వైసీపీ కసిగా కృషి చేసింది అని అంటున్నారు.

దాంతో సిక్కోలు మేయర్ ని గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది అని కూడా వినిపిస్తున్న మాట. కూటమి తమ విజయ పరంపరంలో భాగంగా శ్రీకాకుళం మేయర్ పీఠాన్ని కూడా గెలుచుకుంటుందని ఆ వైపు ధీమాగా ఉన్నారు. ఓటర్లు అయితే తమ విలక్షణమైన తీర్పుని ఎవరికి అనుకూలంగా ఇస్తారు అన్నది అయితే సస్పెన్స్ గా ఉంది. శ్రీకాకుళం కార్పోరేషన్ లో అరవై డివిజన్లు ఉన్నాయి. ఫలితాలు ఈ నెల 30న వెలువడనున్నాయి. దాంతో ఎవరు విజేత అన్నది అయితే అధికారిక ఫలితం రావాలంటే మరింత నిరీక్షణ అవసరం అంటున్నారు.