Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సెంట్రిక్‌గా తెలంగాణ రాజ‌కీయం... బెనిఫిట్టేనా.. ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జగన్, కేసీఆర్, హరీశ్‌రావులపై చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. పల్నాడు వాటర్ గ్రిడ్, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుల అంశాలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జగన్‌కు, వైసీపీకి రాజకీయంగా మేలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By:  Garuda Media   |   29 Nov 2026 4:00 AM IST
జ‌గ‌న్ సెంట్రిక్‌గా తెలంగాణ రాజ‌కీయం... బెనిఫిట్టేనా.. ?
X

వైసీపీ అధినేత జ‌గ‌న్ సెంట్రిక్‌గా గ‌త రెండు రోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. వైసీపీ అధికా రంలో ఉన్న‌ప్పుడు.. త‌మ నీటిని త‌ర‌లించుకు పోయార‌ని.. ముఖ్యంగా అప్ప‌టి తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మంత్రి హ‌రీష్‌రావులు జ‌గ‌న్‌తో చేతులు క‌లిపి.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి వ‌రుస‌గా ప‌లు స‌భ‌ల్లో చెబుతున్నారు. ఇది ఆయ‌న‌కు అక్క‌డ మైలేజీ పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. తెలంగాణ స‌మాజంలో నీటి కి ఉన్న సెంటిమెంటును త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే.. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ను కేంద్రంగా చేసుకుని సీఎంరేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు ఏపీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి కొన్ని కొన్ని విష‌యాలు రేవంత్ రెడ్డి చెప్పే వ‌ర‌కు తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టు దీనికి ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌. కృష్ణాన‌ది జ‌లాల విష‌యంలో ఇప్ప‌టికే ఇబ్బందులు ప‌డుతున్నా మ‌ని.. మ‌రోవైపు ప‌ల్నాడుకు జ‌గ‌న్ హ‌యాంలో వాట‌ర్ గ్రిడ్ నిర్మించుకునేందుకు అనుమ‌తులు ఇచ్చార‌ని.. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

అప్ప‌టికానీ.. జ‌గ‌న్ చేప‌ట్టిన ప‌ల్నాడు వాట‌ర్ గ్రిడ్ విష‌యం సొంత పార్టీ నాయ‌కుల‌కు కూడా తెలియ‌దంటే ఆశ్చ ర్యం వేస్తుంది. కానీ, ఇవి వాస్త‌వం. ప‌ల్నాడులో వాట‌ర్ గ్రిడ్ చేప‌ట్టిన విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఇక‌, రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు విస‌యాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనివ‌ల్ల కూడా తెలంగాణ‌కు చాలా అన్యాయం జ‌రిగింద‌న్నారు. కానీ, ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసీఆర్‌.. జ‌గ‌న్‌కు అప్ప‌గించార‌ని అన్నారు. ఈ ప‌రిణామం గురించి అంద‌రికీ తెలిసిందే అయినా.. రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే చెప్ప‌డం ద్వారా.. సీమ‌కు జ‌గ‌న్ చేసిన మేలు క‌నిపిస్తోంద‌ని పార్టీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఒక‌రిపై కోపం..

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఉన్న కోపంతోనో. రాజ‌కీయం కోసమో.. ప్ర‌స్తుతం పాత విష‌యాలు త‌వ్వుతున్నా.. ఇది ప‌రోక్షంగా వైసీపీకి, ముఖ్యంగా జ‌గ‌న్‌కు మేలు చేస్తాయ‌న్న చ‌ర్చ వైసీపీలో వినిపిస్తోంది. తెలంగాణ‌కు అన్యాయం చేశార‌న్న వాద‌న వున్నా.. అక్క‌డ వైసీపీ లేదు. అక్క‌డ ఓటు బ్యాంకుతోనూ జ‌గ‌న్‌కు ప‌నిలేదు. కానీ,, ఎటొచ్చీ.. ప‌ల్నాడు, సీమ‌లలో మాత్రం వైసీపీ ఈ విష‌యాన్ని ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నం ప్రారంభిస్తే.. కొంత మేర‌కు వైసీపీ పుంజుకుంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. పాత విష‌యాలు త‌వ్వి.. వైసీపీ మేలు చేస్తున్నార‌ని.. రేవంత్‌పై ఏపీకాంగ్రెస్‌ పార్టీ నాయ‌కులు కొంత ఆగ్ర‌హంతో ఉన్నార‌న్న వాద‌నా వినిపిస్తోంది.