జనసేన బలపడినట్లేనా ?
2019లో ఒక్క ఎమ్మెల్యేతో ప్రస్థానం ప్రారంభించిన జనసేన.. 2024లో 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలు సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 487 వార్డులు, 73 జెడ్పీటీసీలు, 938 ఎంపీటీసీలు గెలుచుకుంది. పలు మేయర్, ఎంపీపీ, వైస్ చైర్మన్ పదవులూ దక్కించుకుంది. కూటమిలో కొనసాగుతూనే రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించడంపై పవన్ వ్యూహాలు రచిస్తున్నారు.
By: Satya P | 24 Nov 2026 9:15 AM ISTఏపీలో జనసేన బలపడినట్లేనా. ఈ ప్రశ్న రాజకీయ విశ్లేషకులు కూడా వేసుకుని తరచి చూస్తున్నారు. ఇక జనసేనలో కూడా దీని మీద చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు పొత్తులలో దక్కిన సీట్లలో గెలుపు బాట పట్టారు. అలాగే విశాఖ వంటి చోట్ల డిప్యూటీ మేయర్ పదవితో పాటు 26 మంది కార్పోరేటర్లు గాజు గ్లాస్ పార్టీకి దక్కాయి. విజయవాడ, ఏలూరు మేయర్ సీట్లు లభించాయి. అలాగే జనసేనకు జిల్లా పరిషత్తులు అయిదు దాకా సొంతం అయ్యాయి. మునిసిపాలిటీలు తీసుకుంటే జనసేనకు దక్కినవి పోటీ చేసిన 15 మున్సిపాలిటీలు 3 నగర పంచాయతీలు ఖాతాలో పడ్డాయి.
గ్రౌండ్ లెవెల్ లో :
ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 3 వేల 942 వార్డులలో ఎన్నికల్లో జనసేన మొత్తం 487 వార్డుల్లో విజయం సాధించింది. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు చూసుకుంటే జనసేన గెలుచుకున్నవి 73 జెడ్పీటీసీ 938 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక ఏకగ్రీవమైన స్థానాలతో కలిపితే జనసేన మొత్తం బలం మరింత ఎక్కువగా ఉంది. ఎంపీపీ పదవులు కూడా జనసేనకు దక్కినవి 42 ఎంపీపీ పదవులు 83 వైస్ ఎంపీపీ పదవులు దక్కాయి. జెడ్పీలలో వైఎస్ చైర్మన్లు జనసేనకు 5 దాకా లభించాయి. ఇక మునిసిపాలిటీలలో 18 వైఎస్ చైర్ పర్సన్ పదవులు కూడా ఆ పార్టీ అందుకుంది. ఇక రెండవ విడతలో జరితే 23 పట్టణాలలో జనసేనకు కీలకమైన సీట్లు దక్కే చాన్స్ ఉంది.
పంచాయతీలు సైతం :
అదే విధంగా ఏపీలో 13 వేల పై చిలుకు ఉన్న పంచాయతీలలో కూడా జనసేనకు భారీగానే అవకాశాలు దక్కుతాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే 2019లో కేవలం ఒక ఎమ్మెల్యేతో తన అధికార ప్రయాణాన్ని ప్రారంభించిన జనసేన 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని 21 ఎమ్మెల్యేలు రెండు లోక్ సభ, ఒక రాజ్యసభ, రెండు ఎమ్మెల్సీలు, అలాగే పలు నామినేటెడ్ పోస్టులు దక్కించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింతగా పటిష్టం అయింది అని అంటున్నారు.
అసంతృప్తి ఉందా :
అయితే జనసేన ఒక రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో ఎదగాలని చూస్తోంది. ఆ పార్టీ కూడా వైసీపీ టీడీపీ మాదిరిగా రాష్ట్రమంతా విస్తరించి ఏదో నాటికి ఏపీలో అధికారం అందుకోవాలని ఆలోచిస్తోంది. మరీ ముఖ్యంగా క్యాడర్ లో ఈ భావన అధికంగా ఉంది. అయితే జనసేనకు కూటమిలో టీడీపీ తరువాత ప్రాధాన్యత బాగానే లభిస్తోంది అని అంటున్నారు. కానీ రాజకీయ పార్టీలకు ఆకాంక్షలు ఉంటాయి కాబట్టి ఇది చాలదనే చర్చ ఎపుడూ ఉంటుంది. అదే సమయంలో జనసేన బలం ఇంకా ఎక్కువగా ఉందని కూడా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో చూస్తే ఈ రకమైన పోస్టులు కనిపిస్తాయి. నిజంగా జనసేనకు ఎక్కువగానే బలం ఉండొచ్చు కానీ కూటమిలో పొత్తుల ధర్మంతోనే ఈ పోటీ చేసింది అన్నది కూడా గుర్తుంచుకోవాలని అంటున్నారు.
పవన్ వ్యూహాత్మకంగానే :
ఇక అధినేత పవన్ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారు. ఆయన నెమ్మదిగానే పార్టీని విస్తరించుకుని వెళ్తున్నారు. 2019 నుంచి 2026 దాకా సాగిన ఏడేళ్ల జనసేన అధికార ప్రయాణంలో ఇన్ని పదవులు ఈ గ్రోత్ అన్నది నిజంగా హర్షించతగినదే అని అంటున్నారు. కానీ ఇక్కడితో ఆగిపోకూడదు అన్నది కూడా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయాలను విపక్షంలో ఉన్న వైసీపీని రాష్ట్ర అభివృద్ధిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే జనసేన తగిన విధంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. పవన్ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు అని చెబుతున్నారు. కూటమితో కొనసాగుతూనే జనసేన మరింతగా ఎలా విస్తరించాలి అన్నది జనసేన అధినాయకత్వం కార్యాచరణ రూపొందించుకుంటోందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇపుడు చూస్తే ఏపీలో టీడీపీ తరువాత ఎక్కువగా అధికార పదవులు జనసేనకే ఉన్నాయి. అలా వైసీపీని మూడవ ప్లేస్ లోకి పంపించారనే అంటున్నారు.
