వైసీపీలో అంతర్గత పోరు.. నెల్లూరు మునక.. !
కానీ, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రెడ్డి సామాజిక వర్గంతో వైసీపీ బంధం తెగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ రెండున్నరేళ్లలో కూడా.. ఎక్కడా వైసీపీకి రెడ్డి కమ్యూనిటికీ కనెక్ట్ కాలేదు.
By: Garuda Media | 5 Nov 2026 11:53 AM ISTవైసీపీలో నెలకొన్న అంతర్గత పోరు.. ఆ పార్టీకి ఎంత నష్టం కలిగిస్తుందన్నదానికి అనేక జిల్లాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఒక్క నందికొట్కూరు, అనంతపురం వంటి స్థానాల్లో తప్ప.. ఎక్కడా కూడా వైసీపీ నాయకత్వంలో పట్టు, బెట్టు కనిపించలేదు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు.. గుంటూరు నుంచి నెల్లూరు వరకు కూడా వైసీపీ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. ముఖ్యంగా నెల్లూరు అంటేనే రెడ్డి సామాజిక వర్గానికి పెట్టింది పేరు. ఇక, రెడ్లు అంటేనే వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న చర్చ ఉంది.
కానీ, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రెడ్డి సామాజిక వర్గంతో వైసీపీ బంధం తెగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ రెండున్నరేళ్లలో కూడా.. ఎక్కడా వైసీపీకి రెడ్డి కమ్యూనిటికీ కనెక్ట్ కాలేదు. ఈ ఫలితానికి తోడు.. నెల్లూరులో అనేక మంది నాయకులు ఉండి కూడా. వైసీపీని విజయతీరాలకు కాదుకదా.. కనీసం గౌరవప్రదమైన స్థానాలకు కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేక పోయారు. కౌంటింగ్‌కు ముందే 8 డివిజన్లు కూటమి అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. పోటీ జరిగిన మిగిలిన డివిజన్లలో 56 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.
ఓవరాల్‌గా 72 వార్డులలో టీడీపీ ఏకంగా 41 వార్డులను సొంతం చేసుకోగా, కూటమిలోని బీజేపీ 6, జనసేన 3 వార్డుల్లో విజయం సాధించి కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకున్నాయి. నెల్లూరు నూతన మేయర్‌గా టీడీపీ అభ్యర్థి పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ భారీ విజయాన్ని అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై 80,170 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని అధిష్టించారు. మొత్తంమీద, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, సూళ్లూరుపేట వంటి మున్సిపాలిటీలలో కూడా కూటమి ఏకపక్ష విజయాలను నమోదు చేసింది.
నేతలు ఏమయ్యారు.. ?
వైసీపీకి నెల్లూరులో నేతాగణం.. వారి బలం లేదా? అంటే ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వంటి మాజీ మంత్రులతో పాటు అనేక మంది సీనియర్లు కూడా ఉన్నారు. అయిన.. కూడా ఎవరూ ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదన్నది సుస్పష్టం. దీంతో కూటమికి తిరుగులేకుండా పోయింది. పైగా వైసీపీలోని కొందరు నాయకులు రూప్ కుమార్ తో ముందుగానే చేతులు కలిపారన్న వాదన కూడా తెరమీదికి వచ్చింది. మరి దీనిలో ఎంత నిజం ఉందన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. అంతర్గతంగా జరుగుతున్న పోరు.. పార్టీ విధానాలపై ఏవగింపు వంటివి స్పష్టంగా నెల్లూరులో వైసీపీని ముంచేయడం గమనార్హం.
