Begin typing your search above and press return to search.

లోకేష్ మమేకం.. ఇతర పార్టీలూ నేర్చాల్సిందే !

నారా లోకేష్ పార్టీ క్యాడర్‌తో మమేకమవుతున్న తీరు టీడీపీలో చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీ నేతల ఇళ్లలో శుభకార్యాలు, విషాద ఘటనలకు స్వయంగా హాజరవుతూ అండగా నిలుస్తున్నారు. విశాఖ మేయర్ ముక్కా శ్రావణి తండ్రి మరణంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్, మరుసటి రోజే భోగాపురం టీడీపీ నేత కర్రోతు బంగార్రాజు కుమారుడి వివాహానికి హాజరయ్యారు.

By:  Satya P   |   26 Nov 2026 9:20 AM IST
లోకేష్ మమేకం.. ఇతర పార్టీలూ నేర్చాల్సిందే !
X

నారా లోకేష్. నిజంగా రాజకీయ విమర్శకులకు ప్రత్యర్ధులకు విశ్లేషకులకు సైతం ఊహకందనంత ఎత్తులో ఎదిగిపోయారు. ఆయా 2019 నుంచి తన గ్రాఫ్ ని అలా పెంచుకుంటూ దూసుకుని పోతున్నారు. అటు ఇంటర్నేషనల్ సమ్మిట్స్ లో క్లాస్ టచ్ తో అలరిస్తున్నారు. అలాగే మాస్ టచ్ తో రాజకీయ సమావేశాలోనూ రాణిస్తున్నారు. అంతే కాదు టీడీపీలో ఆయన పెద్దన్నగా క్యాడర్ తో మమేకం అవుతున్న తీరు అయితే అన్ని పార్టీలు చూసి స్పూర్తి పొందాల్సిందే అని అంటున్నారు.

మంచికీ చెడ్డకూ :

నారా లోకేష్ కీలకమైన మంత్రిత్వ శాఖలతో నిరంతరం బిజీగా ఉంటారు. అంతె కాదు టీడీపీలో జాతీయ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్. ఇలా పార్టీ ప్రభుత్వంలో అతి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆయన ఎన్నో సదస్సులకు అటెండ్ అవుతున్నారు. అలాగే మీడియాతో ఇంటర్వూలు కాంక్లేవ్ లలో పాలు పంచుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీ క్యాడర్ తో మమేకం అవుతున్న తీరు కూడా శభాష్ అనిపించుకుంటోంది. తమ పార్టీ వారి ఇంట మంచి జరిగినా విషాదం వచ్చినా లోకేష్ అటెండ్ అవుతున్నారు. తాను ఉన్నాను అని తన హాజరుతో వారికి భరోసా ఇస్తున్నారు. దాంతోనే ఆయన పార్టీకి మరింతగా దగ్గర అయిపోయారు అని అంటున్నారు.

బాధ్యతగానే ఉంటూ :

విశాఖ మేయర్ ముక్కా శ్రావణి తండ్రి మరణిస్తే ఆ కుటుంబాన్ని లోకేష్ స్వయంగా హాజరై పరామర్శించారు. ఆ ఇంటికి వెళ్ళి మరీ భరోసా ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు తిరగకముందే విజయనగరం జిల్లా భోగాపురం టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు కుమారుడి వివాహం సందర్భంగా అక్కడ లోకేష్ కనిపించారు. ఆ పెళ్ళి వేడుకలో అందరితో కలసి ఆనందంగా ముచ్చటిస్తూ సందడి చేశారు. ఇక విశాఖలో పార్టీ ఆఫీసులో కూడా క్యాడర్ ని కలుస్తూ పలకరిస్తూ ఆయన పార్టీని మరింత దగ్గర చేసుకుంటూ సాగుతున్నారు.

ఉండాల్సిన లక్షణం :

రాజకీయ పార్టీల అధినేతలు సాధారణంగా తమ పార్టీ వారికే పెద్దగా అపాయింట్మెంట్లు ఇవ్వరు, దూరంగా ఉంటారు అన్నది ఉంది. కొన్ని పార్టీలలో అది జరుగుతోంది కూడా అయితే దానికి భిన్నంగా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు వారితో కొనసాగిస్తున్న మానవ సంబంధాలు ఇవన్నీ కూడా ఆధునిక రాజకీయాలలో అంతా తెలుసుకోవాల్సినవే అంటున్నారు. పార్టీ అంటే కుటుంబం అని అంతా చెబుతారు. కానీ ఆచరణలో చూపించడమే టీడీపీలో జరుగుతోంది అని అంటున్నారు. గతంలో చంద్రబాబు క్యాడర్ కోసం ఒక అడుగు ముందుకు వేస్తే లోకేష్ నాలుగు అడుగులు వేస్తున్నారు అని టీడీపీ నేతలు చెబుతున్నారు అంటే చినబాబు ఎక్కిన సైకిల్ ఎంత జోరుగా సాగుతోందో తెలుస్తోంది కదా అన్నదే అసలైన విశ్లేషణ మరి.