Begin typing your search above and press return to search.

వైసీపీ ఓట్లు చీల్చ‌నున్న ఎంఐఎం.. నిజ‌మేనా.. !

ఈ ఇద్దరితో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించి షేక్ నసీమ్ బానును మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దించింది.

By:  Garuda Media   |   31 Oct 2026 9:54 AM IST
వైసీపీ ఓట్లు చీల్చ‌నున్న ఎంఐఎం.. నిజ‌మేనా.. !
X

వైసీపీకి ప‌రోక్షంగా మిత్ర‌ప‌క్షంగా ఉంటున్న హైద‌రాబాద్కు చెందిన పార్టీ ఎంఐఎం.. ఇప్పుడు ముస్లిం ప్ర‌భావిత జిల్లాల్లో పోటీ చేస్తోంది. స్థానిక మునిసిప‌ల్.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సైలెంట్‌గా పోటీకి దిగింది. ఆ పార్టీ త‌ర‌ఫున ప‌లువురు అభ్య‌ర్థులు రంగంలోకి దిగారు. అయితే.. వీరంతా ముస్లింలే కావ‌డంతో కీల‌క‌మైన మైనారిటీ ఓటు బ్యాంకును సొంతం చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో వారు గెలిచినా.. గెల‌వ‌క పోయినా వైసీపీకి ప‌డే మైనారిటీ ఓటు బ్యాంకును చీల్చ‌డంలో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి.

కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరు ప్రధానంగా కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మహిళా అభ్యర్థుల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా, హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎన్నికల ద్వారా కడప నగరం తన చరిత్రలోనే తొలి మహిళా మేయర్‌ను ఎన్నుకోబోతుండటం విశేషం. టీడీపీ నేతృత్వంలోని కూటమి తరఫున విద్యావంతురాలై న డాక్టర్ మట్లి సువర్ణ(నెల్లటూరి సువర్ణ) బరిలో నిలిచారు. వైసీపీ త‌ర‌ఫున తరఫున మాజీ డిప్యూటీ మేయర్ బి. నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తి(బండి దీప్తి రెడ్డి) పోటీ పడుతున్నారు.

ఈ ఇద్దరితో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించి షేక్ నసీమ్ బానును మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఇదే ఇప్పుడు వైసీపీలో అత్యంత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మైనారిటీ ఓట్ల‌ను న‌సీమ్ కొట్టుకుపోయే అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు వేస్తున్నారు. ప్ర‌స్తుతం క‌డ‌ప‌లో మైనారిటీ ఓట్లు అభ్య‌ర్థుల‌కు కీల‌కంగా ఉన్నాయి. వీటిపై వైసీపీ బాగానే ఆశ‌లు పెట్టుకుంది. కానీ,ఎంఐఎం రూపంలో ఈ ఓట్ల‌ను ఆ పార్టీ కొల్ల‌గొట్టే అవ‌కాశం ఉంద‌న్న చర్చ జోరుగా సాగుతోంది.

ఇక‌, టీడీపీ అభ్య‌ర్థి విష‌యానికి వ‌స్త‌సే.. గతంలో కడప మేయర్ పీఠాన్ని టీడీపీ ఎన్నడూ గెలవలేదు. ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలని స్థానిక ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ ఆర్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు విసృతంగా ప్రచారం చేస్తున్నాయి. నగరంలో తాగునీరు, పారిశుధ్యం, ప్రజా రక్షణ వంటి పౌర సమస్యలను అజెండాగా మార్చుకుని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. పార్టీ అధినేత జ‌గ‌న్ సొంత ఇలాకా కడపను తమ బలమైన కోటగా భావించే వైసీపీ, ఈ ఎన్నికల్లో ఎలాగైనా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. బండి దీప్తి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గత ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, స్థానిక సంబంధాలను నమ్ముకుని ప్రచారం సాగిస్తున్నారు.

ఇదిలావుంటే, ఏకగ్రీవాల ప్రభావం కూడా ఎక్కువ‌గా ఉంది. కడప కార్పొరేషన్‌ పరిధిలోని మొత్తం 66 డివిజన్లలో దాదాపు 52 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 డివిజన్లలోనే ఇప్పుడు పోలింగ్ సాగుతోంది. జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో కూటమి ఏకగ్రీవాలు సాధించడంతో వారి జోరు ఎక్కువగా కనిపిస్తుండగా, వైసీపీ తన సాంప్రదాయ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. అయితే.. ఎంఐఎం రూపంలో ఓటు బ్యాంకుపై సందేహాలు ఏర్ప‌డుతున్నాయి.