Begin typing your search above and press return to search.

జన‌సేన‌కు స్వేచ్ఛ‌.. కూట‌మిలో ఫుల్ జోష్‌... !

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని జనసేన స్పష్టం చేసింది. పార్టీ మద్దతుతో పోటీ చేయాలనుకునేవారికి ఎలాంటి ఆంక్షలు లేవని, వీర మహిళలు కూడా బరిలోకి దిగవచ్చని ప్రకటించింది. గత స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకే అవకాశం ఇవ్వగా, ఈసారి నిర్ణయాన్ని స్థానిక నేతలకే వదిలేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

By:  Garuda Media   |   24 Nov 2026 5:55 AM IST
జన‌సేన‌కు స్వేచ్ఛ‌.. కూట‌మిలో ఫుల్ జోష్‌... !
X

గ్రామీణ స్థాయి ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన తీసుకున్న నిర్ణ‌యం.. ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు!. దీనిని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఊహించిందే. పార్టీ అధినేత ప‌వ‌న్‌పై ఏమేర‌కు ఒత్తిడి ఉంద‌న్న‌ది తాజాగా తీసుకున్న నిర్ణ‌య‌మే చాటి చెబుతోంద‌ని అంటున్న‌వారు కూడా ఉన్నారు. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎవ‌రైనా పోటీ చేయొచ్చ‌ని.. ఇక్క‌డ `బ‌రులు, గిరులు` ఏమీ లేవ‌ని తేల్చేస్తూ.. పార్టీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న ఇచ్చారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తుతో పోటీ చేయాల‌ని భావించే వారికి తిరుగులేకుండా పోయింది.

ఈ నిర్ణ‌యం వెనుక‌..

ఇక‌, స్థానిక‌, జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. గ్రామపంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. జ‌న సేన పూర్తిగా యూట‌ర్న్ తీసుకుంది. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ బ‌ల‌ప‌రిచిన వారికే అవ‌కాశం క‌ల్పించాల‌ని.. లేని వారు త‌ప్పుకోవాల‌ని చెప్పిన అధిష్టానం.. ఈ ద‌ఫా గ్రామీణ స్థాయికి వ‌చ్చే స‌రికి మాత్రం `మీ ఇష్టం` అని స్ప‌ష్టత ఇచ్చిం ది. ఇది ఇటు పార్టీకి అటు వ్యూహానికి కూడా మంచిద‌నే భావ‌న వ్య‌క్త‌ మ‌వుతోంది. జ‌న‌సేన ప్ర‌క‌ట‌న‌లో మ‌రోమాట కూడా ఉంది. వీర మ‌హిళ‌లు కూడా ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయొచ్చ‌ని పేర్కొన‌డ‌మే!.

మొత్తంగా ఈ వ్య‌వ‌హారం వెనుక చాలా పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. న‌గ‌రాలు, పట్ట‌ణాల స్థాయిలో ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం ఒక‌ర‌కంగా ఉంటుంది. ఎవ‌రెవ‌రు కొట్టుకున్నా.. ఎవ‌రెవ‌రు తిట్టుకున్నా.. ప్ర‌జ‌ల ఓటు తాము అనుకున్న వారికే ప‌డుతుంది. దీంతో ఇక్క‌డ వివాదాలు జ‌రిగినా.. ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకునే స‌య‌మం, తీరిక కూడా ఉండ‌వు. కానీ... గ్రామీణ ప్రాంతాల్లో అలా కాదు. స్థానిక అభ్య‌ర్థుల గుణ‌గ‌ణాల నుంచి వారి ప‌నితీరు వ‌ర‌కు కూడాప్ర‌జ‌లు అంచ‌నా వేస్తారు.

ఈ విష‌యంలో ఏ చిన్న‌తేడా జ‌రిగినా.. మూకుమ్మ‌డిగా.. ఓట్లు త‌ర‌లిపోతాయి. ఈ విష‌యమే జ‌న‌సేన త‌న‌కు, కూట‌మికి కూడా అనుకూలంగా మార్చుకుందని అంటున్నారు. గ్రామీణ స్థాయిలో ఎక్కువ మంది పోటీ ప‌డినా.. ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌మైన నాయ‌కుడికే ప‌ట్టంక‌డ‌తారు. పైగా.. గ్రామాల్లో ఓటును అమ్ముకోవ‌డం ఆశించడం వంటివి ఇంకా భారీగా పెరిగిపోలేదు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో జ‌న‌సేన తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా.. వైసీపీ మ‌ద్ద‌తు దారుల‌కు అవ‌కాశం త‌గ్గ‌డంతోపాటు.. ప్ర‌జ‌లు కూడా.. కూట‌మిలోని పార్టీల వైపే ఉంటారు. ఇది అంతిమంగా కూట‌మికే మేలు చేస్తుంద‌న్న అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో జ‌న‌సేన నిర్ణ‌యంపై ఎలాంటి విమ‌ర్శ‌లు రాక‌పోగా.. ఇది మంచి నిర్ణ‌యం అనే మాటే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.