Begin typing your search above and press return to search.

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన త‌న ప‌ట్టును నిలుపుకొంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ కూడా జ‌న‌సేన ఇక్క‌డ భారీ విజయం ద‌క్కించుకున్న ద‌రిమిలా.. స్థానిక ఎన్నిక‌ల‌ను కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

By:  Garuda Media   |   3 Nov 2026 5:00 PM IST
గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!
X

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన త‌న ప‌ట్టును నిలుపుకొంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ కూడా జ‌న‌సేన ఇక్క‌డ భారీ విజయం ద‌క్కించుకున్న ద‌రిమిలా.. స్థానిక ఎన్నిక‌ల‌ను కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా జ‌రిగిన పోలింగ్‌లో తూర్పు, ప‌శ్చిమ ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో టీడీపీస‌హా జ‌న‌సేన జోరు స్ప‌ష్టంగా క‌నిపించింది. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి జిల్లా మునిసిప‌ల్ స్థానంలో జ‌న‌సేన అభ్య‌ర్థులు 100 శాతం స్ట్ర‌యిక్ రేట్‌తో దూసుకు పోయారు. ఆ పార్టీకి కేటాయించిన అన్ని స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇక‌, ఇదే జిల్లాలో బీజేపీకి కేటాయించిన స్థానాల్లో మాత్రం మూడు చోట్ల వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో మొత్తం 96 కౌన్సిల‌ర్ స్థానాలు ఉంటే.. కేవ‌లం 3 చోట్ల మాత్ర‌మే వైసీపీ విజ‌యం సాధిం చ‌గా.. 93 స్థానాల్లో టీడీపీ, జ‌న‌సేన‌లు జ‌య‌భేరి మోగించాయి. ముఖ్యంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలోని అన్ని స్థానాల్లోనూ జ‌న‌సేన విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఆ పార్టీ త‌న స్థిర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌ద‌న‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా మారింది.

ఇక‌, కాకినాడ, గొల్లు ప్రోలు ప్రాంతాల్లోనూ జ‌న‌సేన అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో మునిసిప‌ల్ చైర్మ‌న్ సీటు కూడా కూట‌మికే ద‌క్కింది. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాలోనూ జ‌న‌సేన త‌న ప‌ట్టును నిలుపు కొంది. ప్ర‌తి స్థానంలోనూ అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆశించిన ఓటు బ్యాంకు కంటే కూడా త‌గ్గ‌డం ఒక్క‌టే మైన‌స్‌గా మారింది. నిజానికి గెలిచిన ప్ర‌తి అభ్య‌ర్థికీ 200 లోపు మాత్ర‌మే మెజారిటీ ద‌క్కింది. వాస్త‌వానికి ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేసినా.. వైసీపీతో హోరా హోరీ పోటీ త‌ప్ప‌లేద‌ని నాయ‌కులు చెబుతున్నారు.