Begin typing your search above and press return to search.

వైసీపీలో నెంబర్‌-3... ఫోక‌స్ ఆ వ‌ర్గంపైనేనా.. !

వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ధనుంజయరెడ్డి ఇప్పుడు పార్టీలో మూడో కీలక కేంద్రంగా ఎదుగుతున్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీకి దూరమైన రెడ్డి సామాజికవర్గ నేతలను తిరిగి దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్రచారంపై పార్టీ ముఖ్య నేతలు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.

By:  Garuda Media   |   23 Nov 2026 8:00 PM IST
వైసీపీలో నెంబర్‌-3... ఫోక‌స్ ఆ వ‌ర్గంపైనేనా.. !
X

వైసీపీలో జ‌గ‌న్‌కు అత్యంత విధేయుడిగా ఉండే.. ఓ రెడ్డి సామాజిక‌ వ‌ర్గం నాయ‌కుడు మూడో కేంద్రంగా అవ‌త‌రించాడా? తెర‌వెనుక కీల‌క విష‌యాల‌ను ఆయ‌న చ‌క్క‌ బెడుతున్నాడా? అంటే.. ఔన‌నే స‌మాధానమే వినిపిస్తోంది. ప్ర‌స్తు తం ఇద్ద‌రు ముగ్గురు పేర్లు ప్ర‌చారంలోకి కూడా వ‌చ్చాయి. ముఖ్యంగా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన ధ‌నుంజ‌య‌రెడ్డి.. పేరు విస్తృతంగా ప్ర‌చారంలో ఉంది. వైసీపీ హ‌యాంలో కీల‌క‌మైన మ‌ద్యం, ఇసుక కాంట్రాక్టుల‌ను క‌ట్ట‌బెట్టే వ్య‌వ‌హారం అంతా ధ‌నుంజ‌య రెడ్డి కేంద్రం గానే సాగింది.

జ‌గ‌న్‌కు అత్యంత విధేయులుగా ఉన్న అప్ప‌టి నాయ‌కుల్లో సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ల‌తోపాటు ధ‌నుంజ‌య రెడ్డికి కూడా ప్రాధాన్యం ఉంది. వైఎస్ వివేకానంద‌ రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ స‌మ‌యంలోనూ కొంద‌రు నిందితులు.. ధ‌నుంజ‌య‌రెడ్డి పేరును చెప్ప‌డం గ‌మ‌నార్హం. ''ధ‌నుంజ‌య‌రెడ్డి నుంచే స‌మాచారం జ‌గ‌న్‌కు చేరుతుంది'' అని అప్ప‌ట్లో ఇద్ద‌రు నిందితులు మీడియాకు కూడా చెప్పారు. పార్టీ వ్య‌వ‌హారాలు స‌హా.. ప్ర‌భుత్వంలోనూ జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడి గా కూడా వ్య‌వ‌హ‌రించార‌న్న పేరుంది.

జ‌గ‌న్‌మాటే శిలాశాస‌నం అన్న మాట‌.. ధ‌నుంజ‌య‌రెడ్డి నుంచే ఎక్కువ‌గా వినిపించేద‌ని అంటారు. త‌ర్వాత‌.. పార్టీ ఓడిన నేప‌థ్యంలో స‌జ్జ‌ల వ్య‌వ‌హారం వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. దీంతో రెడ్డి సామాజిక వ‌ర్గం దాదాపు దూర‌మైంది. కీల‌క నాయ‌కులు పార్టీని వ‌దిలి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత‌.. రెడ్డి సామాజిక‌ వ‌ర్గాన్ని మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా సాగ‌క‌పోయినా. ఉన్న‌వారిలో అంతో ఇంతో న‌మ్మ‌కంగా ఉన్న ధ‌నుంజ‌య‌రెడ్డి ద్వారానే.. జ‌గ‌న్ వెళ్లిపోయిన వారిని తిరిగి ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

``క‌ర్త -క‌ర్మ -క్రియ‌`` అంటూ ఓ మీడియా వ‌రుస పెట్టి ధ‌నుంజ‌య‌రెడ్డి పై క‌థ‌నాలు రాసిన విష‌యం కూడా ఈ సందర్భంగా ప్ర‌స్తావ‌నార్హం. క‌ట్ చేస్తే.. ఇప్పుడు రెడ్డి సామాజిక వ‌ర్గం కేంద్రంగా ధ‌నుంజ‌య‌రెడ్డి మూడో నేత‌గా అవ‌త‌రిం చార‌ని చెబుతున్నారు. పార్టీ మ‌నుగ‌డ‌కు కీల‌క‌మైన ఈ వ‌ర్గాన్ని చేరువ చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కొంద‌రు చెబుతున్నా.. మ‌రికొంద‌రు మాత్రం.. అంత‌కంటే ఎక్కువ‌గానే `వ్య‌వ‌హారం` న‌డుస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ధ‌నుంజ‌య‌రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారడం గ‌మ‌నార్హం. అయితే.. ఈ విష‌యంపై ద్వితీయ శ్రేణినాయ‌కులు చెబుతున్న‌ట్టు గా ఇప్ప‌టి వ‌రకు మిగిలిన వారు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు.