Begin typing your search above and press return to search.

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

AP Zilla Parishad elections, AP ZP chairperson posts, TDP Jana Sena BJP alliance, ZP chairperson sharing formula, district-wise ZP chairperson list

By:  Satya P   |   20 Nov 2026 9:06 AM IST
జడ్పీ పీఠాలు :   టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1
X

ఏపీలో మొత్తం 27 జిల్లా పరిషత్తులలో కూటమి పార్టీలు మూడు పొత్తులలో భాగంగా సామరస్యంగా పంపకాలు చేసుకున్నాయి. బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఈ మేరకు విడుదల చేసిన జాబితా చూస్తే టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1 దక్కాయి. ఇక ఇందులో జనసేనకు దక్కిన జడ్పీ ఛైర్మన్ పదవులు చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, అనకాపల్లి, కాకినాడ ఉన్నాయి. బీజేపీకి కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి దక్కింది. మిగిలిన 22 చోట్ల టీడీపీ జడ్పీ చైర్ పర్సన్లు ఉంటాయి. అదే విధంగా జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్లలో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2 గా ఒప్పందం కుదిరింది.

అక్కడ చిన్న శ్రీను కుమార్తెకే :

ఇక అందరూ ఉత్తరాంధ్రాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విజయనగరం జిల్లా పరిషత్తు జడ్పీ చైర్ పర్సన్ పదవిని చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్రకు ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన చిన్న శ్రీను ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించగలిగారు అని అంటున్నారు. 2021 నుంచి 2026 దాకా అయిదేళ్ల పాటు ఆయన వైసీపీ నుంచి చైర్ పర్సన్ గా పాలించారు. ఇపుడు కుమార్తెకు ఈ పీఠం దక్కడంతో మరోసారి ఆయన ముద్ర అధికారికంగా జిల్లా రాజకీయాల మీద బలంగా ఉండబోతోంది అని అంటున్నారు.

వీరే టీడీపీ చైర్మన్లు :

ఇదిలా ఉంటే జిల్లాల వారీగా టీడీపీ నుంచి జడ్పీ ఛైర్మన్ పదవులకు చూస్తే విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా మజ్జి సిరి సహస్ర ఖరారు అయితే విశాఖ జడ్పీ ఛైర్మన్‌గా గాడు అలివేణి పేరు ఖరారు చేశారు. తూర్పు గోదావరి జడ్పీ ఛైర్మన్‌గా కాడ పద్మ ఎంపిక అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా కోట పుల్లమ్మ ఎంపిక అయ్యారు. గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా ధార అరుణ, పల్నాడు జడ్పీ ఛైర్మన్‌గా పుచ్చకాయల రమాదేవి, ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌గా కొక్కిలిగడ్డ ప్రభాకరరావు, నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా చూడి ఉలిగయ్య, అనంతపురం జడ్పీ ఛైర్మన్‌గా గంజే నాగరాజు, శ్రీ సత్యసాయి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్, కడప జడ్పీ ఛైర్మన్‌గా పుత్తా నరసింహారెడ్డి, అన్నమయ్య జడ్పీ ఛైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు, తిరుపతి జడ్పీ ఛైర్మన్‌గా హేమలత పేరు ఖరారు అయ్యారు. బీజేపీ జనసేన తమ అభ్యర్ధుల విడుదల చేయాల్సి ఉంది.