Begin typing your search above and press return to search.

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 95 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు కూటమి పార్టీలనే కోరుకుంటున్నారని, టీడీపీ, జనసేన, బీజేపీల ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. పదవులు దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్లను బుజ్జగించేది లేదని, పార్టీ కోసం మరికొంత కాలం వేచి ఉండాలని సూచించారు.

By:  Garuda Media   |   21 Nov 2026 10:53 PM IST
వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు
X

``వ్య‌క్తిగ‌తంగా ఏదో సాధిస్తామ‌ని కొంద‌రు మావాళ్లే చెబుతున్నారు. మంచిదే. దీనిని కాద‌న‌ను. కానీ, ప్ర‌జ‌ల అభి ప్రాయం చూస్తే.. వారు కూట‌మినే కోరుకుంటున్నారు. 2024 ఎన్నిక‌ల్లో అయినా.. ఇప్పుడు జ‌రిగిన స్థానిక‌, జ‌డ్పీ ఎన్నిక‌లు అయినా.. ప్ర‌జ‌లు కూట‌మి పార్టీల నాయ‌కులనే ఎన్నుకున్నారు. కూట‌మితో ఉంటేనే అభివృద్ధిలో ముందుకు సాగుతామ‌ని ప్ర‌జ‌లు కూడా భావిస్తున్నారు`` అని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. తాజాగా జ‌రిగిన స్థానిక‌, జ‌డ్పీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. అలానే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితులపై ఆయ‌న సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు.

94 శాతం స్ట్రయిక్ రేట్‌ను కూట‌మి పార్టీలు నిల‌బెట్టుకున్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కూట‌మికి 94 శాతం స్ట్ర‌యిక్ రేట్ ఇచ్చార‌న్నారు. ఇప్పుడు ఒక శాతం మేర‌కు ఇది పెరిగింద‌ని చెప్పారు. త‌ద్వారా త‌మ‌పై ప్ర‌జ‌లు మ‌రింత బాధ్య‌త‌ను పెట్టార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కూట‌మి పార్టీలు కూడా.. ఈ ఎన్నిక‌ల్లో భారీగా ల‌బ్ధి పొందాయ‌న్నారు. బీజేపీ, జ‌న‌సేన పార్టీల ఓటు బ్యాంకు కూడా పెరిగింద‌న్నారు. గ‌త ఎన్నిక‌లతో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం టీడీపీకి కూడా ఓటు బ్యాంకు పుంజుకుంద‌న్నారు.

రుస‌రుస‌లు ఎందుకు?

కూట‌మి పార్టీల్లో ఐక్య‌త ఎక్క‌డా త‌ప్ప‌లేద‌ని చంద్ర‌బాబుఅన్నారు. మూడు పార్టీలు క‌విడిగా మాట్లాడుకునే.. సీట్ల‌ను షేర్ చేసుకున్నామ‌న్నారు. అయితే.. కొన్ని కొన్ని చోట్ల టీడీపీ సీనియ‌ర్లు, మాజీ ఎమ్మెల్యేలు రుస‌రుస‌లాడార‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. ఇలాంటి వారిని బుజ్జ‌గించేది లేద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌మంటే.. నొప్పా.. అని ప్ర‌శ్నించారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు చాలా మంది ఉన్నార‌ని గుర్తు చేశారు. ఒక్కొక్క‌సారి అవ‌కాశాలు త‌లుపు త‌డ‌తాయి.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో వెయిట్ చేయాలి.. అయినా ఎవ‌రికీ అన్యాయం చేయ‌లేద‌న్నారు.

వైసీపీ అంతే..

గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని.. ఇక ఆ పార్టీ అంతేన‌ని ప్ర‌జ‌లు కూడా త‌మ‌కు ఎవ‌రు మేలు చేస్తు న్నారో.. ఎవ‌రు కీడు చేస్తున్నారో.. ఎవ‌రి వ‌ల్ల రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతోందో తెలుసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. అందుకే కూట‌మికే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌ని అన్నారు. వైసీపీ మాదిరిగా వ్య‌వ‌హ‌రించేందుకు కూట‌మిలో ఎవ‌రూ సిద్ధంగా లేర‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసేందుకే.. ఏమాత్రం ఆర్థిక స్తోమ‌త లేని వారికి కూడా.. ఇప్పుడు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. ఇది పార్టీ నిబ‌ద్ధ‌త‌కు, కూట‌మి ఐక్య‌త‌కు ప్ర‌ధానంగా అద్దం ప‌డుతోంద‌న్నారు.