Begin typing your search above and press return to search.

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ ఏడాదిలోనే డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిల్లు ఆమోదం పొందితే ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. పెరిగిన సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుల సర్దుబాటు సులభమవుతుందని, వైసీపీ నేతలను ఆకర్షించే వ్యూహానికీ అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

By:  Satya P   |   20 Nov 2026 2:41 AM IST
పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?
X

డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించుకునే ఈ ఏడాది క్యాలెండర్ ని తిప్పాలని కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ గట్టిగా డిసైడ్ అయింది. దాని కోసం చేయాల్సిన కసరత్తు అంతా చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడానికి ఒకసారి అయితే గురి తప్పింది. ఈసారి అలా జరగదు అన్న ధీమాతో కాషాయ దళం ఉంది. ఈ ఏడాదిలోనే డీలిమిటేషన్ బిల్లు ఆమోదం ఎందుకు అంటే 2029 ఎన్నికల్లో పెరిగిన సీట్లతో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడాలని బీజేపీ సహా ఎన్డీయే మిత్రులు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అందుకు సమయం ఉండాలి అంటే 2026 లో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది.

ఏపీలో పెద్ద నంబర్ :

ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లు కనుక పార్లమెంట్ ఆమోదం పొందితే పార్లమెంట్ అసెంబ్లీ సీట్లలో కూడా ఉన్న సీట్లలో సగం సీట్లు పెరుగుతాయని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఏపీలో 175 సీట్లు ఉన్నాయి. ఇవి కాస్తా 263 దాకా అవుతాయని అంటున్నారు. అంటే పెద్ద నంబర్ అన్న మాట. ఉమ్మడి ఏపీలో ఉన్న 294 సీట్లకు 31 మాత్రమే తక్కువ. అంటే మళ్ళీ ఎంతో మందికి రాజకీయంగా చాన్స్ దక్కేలా ఈ సీట్ల కూర్పు ఉండబోతోంది అని అంటున్నారు. పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు లేదా మూడు అవుతాయని అంటున్నారు. ఇక కనీసంగా రెండు లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ సీటు అని కూడా నిర్దేశించుకుని మరీ ఈ విభజన ఉండబోతోంది అని అంటున్నారు.

పొత్తులకు ఈజీ :

ఇక కూటమికి ఈ పెరిగిన సీట్ల వల్ల భారీగా రాజకీయ లాభం కలుగుతుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పటి కంటే అధికంగా సీట్లకు పోటీ పడాలని బీజేపీ జనసేన భావిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన విషయం తీసుకుంటే 21 సీట్లతో ప్రస్తుతం ఉన్న ఆ పార్టీ కనీసంగా యాభై సీట్లు కోరుతుందని అంటున్నారు. అలాగే బీజేపీకి 2024లో 10 సీట్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి 15 సీట్లు ఇచ్చినా కూటమిలో పెద్దన్న టీడీపీకి 200 సీట్ల దాకా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో టీడీపీలో ఆశావహులు అందరికీ సర్దుబాటు చేసుకోవచ్చు అని భావిస్తున్నారు. అలాగే పటిష్టమైన పొత్తు బంధంతో మరోసారి 2029 లో సూపర్ హిట్ కొట్టవచ్చు అన్న ధీమా కూడా కనిపిస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్ :

ఇక వైసీపీని 2024 లో ఓటమి తరువాత ఎక్కడికక్కడ కట్టడి చేయడమే కాకుండా కీలక జిల్లాలలో ముఖ్య నేతలను కూటమి చేర్చుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలనే కాదు పంచాయతీ స్థాయిలో ఉన్న నాయకులను కూడా కూటమి పార్టీలు టార్గెట్ చేసి మరీ చేర్చుకున్నాయి. అలా క్షేత్ర స్థాయిలో దెబ్బ తీయాలని వ్యూహంగా ఉంది. ఇక ఈ ఎన్నికలు ముగిసిన తరువాత మరోసారి వైసీపీ మీద ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రయోగించి జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో కీలక నేతలను చేర్చుకునే కార్యక్రమం చేపడతారు అని అంటున్నారు. అలా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని సంస్థాగతంగా గట్టి దెబ్బ తీస్తే ఎన్నికల ముందే గెలిచినట్లు అవుతుందని కూటమి భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఇక ఏపీలో పెరిగిన సీట్లలో ఇలా వచ్చిన వారికి సర్దుబాటు చేయడం ఏమీ కష్టం కాబోదని అంటున్నారు. చూడాలి మరి కూటమి నుంచి కాచుకుని వైసీపీ తన పార్టీని 2029 ఎన్నికల దాకా ఎలా కాపాడుకుని వస్తుందో.