మాటల్లో ‘శాంతి’.. చేతల్లో ‘క్రాంతి’.. అమెరికా-ఇరాన్ లవ్ స్టోరీ
ప్రపంచ దేశాలన్నీ సీట్ బెల్టులు గట్టిగా పెట్టుకోండి.. ఎందుకంటే వెస్ట్ ఏషియా థియేటర్‌లో మళ్లీ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సినిమా మొదలైంది.
ప్రపంచ దేశాలన్నీ సీట్ బెల్టులు గట్టిగా పెట్టుకోండి.. ఎందుకంటే వెస్ట్ ఏషియా థియేటర్‌లో మళ్లీ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సినిమా మొదలైంది. నిన్నటివరకు "ఇక యుద్ధం ఆగిపోయింది.. అంతా ప్రశాంతం" అంటూ అమెరికా, ఇరాన్‌లు ఇచ్చిన బిల్డప్ చూసి ప్రపంచమంతా హమ్మయ్య అనుకుంది. కానీ వీరిద్దరి మధ్య శాంతి అనేది ఎండమావి కంటే దారుణం అని మరోసారి నిరూపితమైంది. ట్రంప్ తాతేమో "ఒప్పందం దాదాపు అయిపోయింది బ్రో" అన్నారు. విదేశాంగ శాఖ ఏమో "60 రోజులు కౌగిలింతలు.. నో కొట్లాటలు" అంటూ ట్వీట్లు చేసింది. తీరా కట్ చేస్తే... సీన్ సముద్రంలోకి మారింది!
హోర్ముజ్ జలసంధి: ‘శాంతి చర్చలు’ అంటే సముద్రంలో మైన్లు పెట్టడమేనా?
"నోరు ఒకటి చెప్తుంది.. చేతులు ఇంకోటి చేస్తాయి" అనే సామెతకు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచారు వీరు. అమెరికా సెంట్రల్ కమాండ్ సడన్‌గా నిద్ర లేచి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పడవలపై, మిసైల్ సైట్లపై దాడులు చేసింది. "అదేం లేదు సార్, వాళ్లు సముద్రంలో మైన్లు పెడుతుంటే.. మేము ‘స్వీయ రక్షణ’ కోసం చిన్నగా టచ్ చేశామంతే!" సెల్ఫ్ డిఫెన్స్ అనే మాటకు కొత్త అర్ధం వెతుకుతున్నారు అమెరికన్లు... ఇరాన్ వర్షన్ మరోలా ఉంది. "ఇది చీటింగ్! కాల్పుల విరమణ అని చెప్పి మమ్మల్ని కొడతారా? బందర్ అబ్బాస్‌లో పేలుళ్లు జరిగాయి, ప్రతీకారం తీర్చుకోకపోతే ఒట్టు!" అంటూ తొడగొట్టేసింది. టేబుల్ మీద కూర్చుని కాఫీ తాగుతూ ‘శాంతి’ గురించి మాట్లాడుకుంటారు.. టేబుల్ కింద మాత్రం ఒకరి కాళ్లు ఒకరు తన్నుకుంటారు. ఇదీ వీరి నైజం!
- ఇద్దరి గొడవ.. మధ్యలో సామాన్యుడి జేబుకు చిల్లు!
ఈ అమెరికా, ఇరాన్ గొడవ పడితే ప్రపంచానికి ఎందుకు టెన్షన్ అనుకుంటున్నారా? ఎందుకంటే వారిద్దరూ కొట్టుకునేది ‘హోర్ముజ్ జలసంధి’ దగ్గర. అది ప్రపంచ చమురు రవాణాకు మెయిన్ రోడ్డు లాంటిది. అక్కడ ఒక్క బాంబు పడినా.. ఇక్కడ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్‌లా పైకి లేస్తాయి. భారత్ లాంటి ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల పరిస్థితి ఎలా ఉందంటే.. "అక్కడ వారు ఈగోలు సాటిస్ఫై చేసుకోవడానికి కొట్టుకుంటే, ఇక్కడ మా బైక్‌లలో పెట్రోల్ పోయించుకోవడానికి కిడ్నీలు అమ్ముకోవాలా?" అని సామాన్యుడు తలపట్టుకుంటున్నాడు.
- అసలు సమస్య ‘ఒప్పందం’ కాదు బాసూ.. ‘నమ్మకం’!
అంతర్జాతీయ విశ్లేషకులు చాలా సీరియస్‌గా చెప్తున్న మాట ఏంటంటే.. సమస్య ఒప్పంద పత్రాల్లో లేదట, ఇరు దేశాల మధ్య ఉన్న ‘నమ్మకం’ లో ఉందట. ఒకరినొకరు ఎంతలా నమ్ముతున్నారంటే.. వెనక కత్తి పట్టుకుని ముందర షేక్‌హ్యాండ్ ఇచ్చుకునేంత.. ఇలాంటి టైంలో ఒక చిన్న తప్పు జరిగినా.. అది ప్రపంచాన్ని మరో పెద్ద యుద్ధంలోకి నెట్టేస్తుంది. మాటల శాంతి ఎప్పుడు చేతల్లోకి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి.
‘శాంతి’ ఎప్పుడు వస్తుందో.. ఏంటో!
ప్రస్తుతానికి వెస్ట్ ఏషియా పరిస్థితి ఎలా ఉందంటే.. "తదుపరి బాంబు పడేవరకు ఇక్కడ శాంతి కొనసాగుతుంది" అన్నట్లుంది. మరి ఈసారి మాటల శాంతి గెలుస్తుందా? లేక హోర్ముజ్ జలసంధి మంటల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాలిపోతుందా? అనేది చూడాలి.