గంటకు ఇరవై...రోజుకు రెండువందలు...విశాఖ సమ్మిట్ కొత్త రికార్డు
ఇక చూస్తే కనుక ఇప్పటికే పరిశ్రమల శాఖ 9 ఎంఓయులు, ఐఅండ్ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4,ఇంధన శాఖ 6,సిఆర్డిఏ 8 ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగింది.;
విశాఖలో జరగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒప్పందాలలోనూ ట్రెండ్ సృష్టిస్తోంది. అలాగే పెట్టుబడులు కూడా పది లక్షల కోట్లకు పైగా రానున్నాయి. దాంతో విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సు ఏపీ దశను మార్చేసే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే కనుక ఈ సందస్సులో వివిధ సెషన్లలో జరిగే డిస్కషన్స్ ఫ్యూచర్ ఏపీ కోసం అభివృద్ధి కోసం ఎంతో ఉపయోగపడనున్నాయి.
విశాఖ గేట్ వేగా :
అంతే కాదు రెండు రోజులలో నాలుగు వందలకు పైగా ఒప్పందాలు అంటే రోజుకు రెండు వందలు గంటకు ఇరవై నుంచి ముప్పయి వంతుల ఈ ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ సదస్సు పెట్టుబడులకు విశాఖ గేట్ వే గా మార్చనున్నాయని అంటున్నరు. ఇక విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్లో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
కీలక రంగాలలో :
ఇక చూస్తే కనుక ఇప్పటికే పరిశ్రమల శాఖ 9 ఎంఓయులు, ఐఅండ్ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4,ఇంధన శాఖ 6,సిఆర్డిఏ 8 ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగింది. అలాగే 14వ తేది తొలిరోజు సదస్సులో ప్రధాన వేదిక ప్రాంగణంలో పరిశ్రమల శాఖ 14, ఐఅండ్ఐ 15,ఆహార శుద్ధి శాఖ 6,ఇంధన శాఖ 21 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అలాగే అదే విధంగా చివరి రోజైన 15వ తేది పరిశ్రమల శాఖ 27 ఎంఓయులను,పర్యాటక శాఖ 21,ఐటి శాఖ 7,చేనేత జౌళి శాఖ రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనుంది.అదే విధంగా ఈరెండు రోజుల్లోను మిగతా హాల్లో కూడా వివిధ సంస్థలతో పలుశాఖలు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయని చెబుతున్నారు.
ఏపీ దశ తిరిగినట్లే :
ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు అందులో లక్షల కోట్లలో రావడంతో ఏపీ దశ తిరిగి నట్లే అని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీకి వ్యవసాయ రాష్ట్రంగానే పేరు ఉంది. ఈ సదస్సు తరువాత ఏపీ బిజినెస్ స్టేట్ గా స్థిరపడనుంది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పాటే కాదు ఉత్తరాదిన ప్రముఖ రాష్ట్రాలతో పెట్టుబడులలో పోటీ పడనుంది అని అంటున్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తరలి రావడంతో ప్రపంచ స్థాయిలో ఏపీ ఆకర్షిస్తోంది. ఈ సమ్మిట్ తరువాత ఏపీ ఇమేజ్ మరింతగా పెరుగుతుందని ఇది అంతర్జాతీయ వేదికల మీద రానున్న కాలంలో మరిన్ని ఉత్తమ ఫలితాలు ఇస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ విషయంలో మాత్రం ఒక ధీమాను ఒక గర్వాన్ని గౌరవాన్ని కలుగచేఏ అతి పెద్ద సదస్సుగా దీనిని అభివర్ణిస్తున్నారు.