షాకింగ్ వీడియో: ప్రేమికుల్లా రెండు బైకులు స్నేక్ డ్యాన్స్ చేయడం చూశారా?
ప్రమాదం వివరాల్లోకి వెళితే.. ఇది జైపూర్ రోడ్ లో జరిగిన ప్రమాదం. రెండు బైక్‌లు రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో వాటిని నడిపేవాళ్లతో సంబంధం లేకుండా `జంట డ్యాన్స్` చేస్తూ ఆశ్చర్యపరిచాయి.;
అది ఒక రోడ్ యాక్సిడెంట్.. ప్రమాద స్థలంలో రెండు బైక్‌లు ఒకదానికొకటి పెనవేసుకుని కొన్ని నిమిషాల పాటు డ్యాన్స్ చేసాయి. ఆ దృశ్యం చూడటానికి సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. ఒకరిని వీడి ఒకరు ఉండేలేనంత తన్మయంలో ఉన్న ప్రేమికులను తలపించాయి ఆ బైక్‌లు. కొన్ని నిమిషాల పాటు ఒకదానికొకటి చుట్టుకుని రోడ్ పైనే గిరగిరా రౌండ్లు తిరిగాయి. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా కనిపించింది. పెన వేసుకున్న రెండు సర్పాల బంధంలా ధృఢంగా ఆశ్చర్యపరిచింది.
ఆ రెండు బైక్‌లు కొన్ని నిమిషాల పాటు ఆగకుండా అలా రోడ్ పై రౌండ్లు తిరుగుతుంటే, వాటిని ఆపేందుకు, వేడి చల్లార్చేందుకు ముగ్గురు కుర్రాళ్లు చేసిన ప్రయత్నం ఆసక్తిని కలిగించింది. చేతిలో పెద్ద కర్రలు తీసుకుని రోడ్ పై రౌండ్లు చుడుతున్న బైక్ లను ఆపేందుకు వారికి చాలా సమయం పట్టింది. కర్రలతో ఆపుతున్నా ఆ బైక్‌ల వెలాసిటీ (వేగం) ఎంతమాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఈ ప్రమాదం ఎక్కడ జరిగినా ఈ వీడియో అందరి వాట్సాప్ లలోకి వైరల్ అయింది. క్షణాల్లో ఇంటర్నెట్ లో దూసుకుపోయింది.
ప్రమాదం వివరాల్లోకి వెళితే.. ఇది జైపూర్ రోడ్ లో జరిగిన ప్రమాదం. రెండు బైక్‌లు రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో వాటిని నడిపేవాళ్లతో సంబంధం లేకుండా `జంట డ్యాన్స్` చేస్తూ ఆశ్చర్యపరిచాయి. ఈ సంఘటన మానసరోవర్ ప్రాంతంలో జరిగింది. బైక్ లు అలా రోడ్ మధ్యలో తిరుగుతూ ఉంటే, చుట్టూ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ట్రాఫిక్ లోంచి ఒక వ్యక్తి ఈ వీడియోని చిత్రీకరించారు. కర్రలతో కొందరు యువకులు వాటిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా అవి ఆగడం లేదు. ఈ స్టంట్ ఎవరూ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సేపు అన్ స్టాపబుల్ గా కొనసాగింది. వైరల్ క్లిప్‌ను @jaipurkajalwa ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
దీనికి సోషల్ మీడియా స్పందనలు అనూహ్యం. ఒకే ఒక్క రోజులో ఈ వీడియోకు 11.5 మిలియన్ల వీక్షణలు దక్కాయి. ఇహలోకాన్ని మర్చిపోయిన ఇద్దరు ప్రేమికులు! అంటూ ఆ బైక్ ల అన్యోన్యతపై కొందరు ప్రశంసలు కురిపించారు. ప్రేమ జంటను కొందరు విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు! అంటూ నెటిజనులు ఛమత్కరించారు. ఈ వీడియోకు `సైయారా సినిమా సైడ్ ఎఫెక్ట్` అనే క్యాప్షన్ ని ఇచ్చారు. ``వాహనాలు నాకన్నా మంచి లవ్ లైఫ్‌ని ఆస్వాధిస్తున్నాయి`` అని ఒకరు వ్యాఖ్యానించారు. ``ఇప్పటివరకు నమోదైన అతి పొడవైన ప్రమాదం` అని మరొకరు రాసారు. ``చేతిలో లాఠీలు పట్టుకుని జంటలను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరు?`` అని ఒకరు ప్రశ్నించారు. వాహనాల యజమానులకు ఇంటర్-వెహికల్ వివాహం కావాలి! అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.