విజ‌య‌వాడ‌ మేయ‌ర్ పోరు ఏక‌ప‌క్షమేనా... ?

ఈ ప‌రిణామంతో తొలి 24 గంట‌లు రాజ‌కీయంగా అనిశ్చితి ఏర్ప‌డింది. పెద్ద ఎత్తున పోటీ ఉంటుంద‌ని కూడా అనుకున్నారు.

Update: 2026-10-19 11:30 GMT

విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో రాజకీయ ప‌రిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. మేయ‌ర్ స్థానానికి జ‌న‌సేన పార్టీ నుంచి వంగ‌వీటి రాధాకృష్ణ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. ఆదిలో ఈ వ్య‌వ‌హారంపై కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న క‌నిపించింది. టీడీపీలోని ఓ వ‌ర్గం కూడా ఈ టికెట్‌ను ఆశించినా.. అస‌లుకే.. మొత్తంగా యూట ర్న్ ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం, కీల‌క‌మైన స్థానంలో ప‌ట్టు నిలుపుకోవాలంటే.. జ‌న‌సేనను గెలిపించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అయితే.. మ‌ధ్య‌లో అనూహ్యంగా మాజీ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఎంట్రీ ఇచ్చారు.

ఈ ప‌రిణామంతో తొలి 24 గంట‌లు రాజ‌కీయంగా అనిశ్చితి ఏర్ప‌డింది. పెద్ద ఎత్తున పోటీ ఉంటుంద‌ని కూడా అనుకున్నారు. అయితే.. తాజాగా లెక్క‌లు మారిపోయాయి. రాధా గెలుపు మ‌రింత ఈజీ అవుతుంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. వైసీపీ నుంచి మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి నామినేష‌న్ దాఖ‌లు చేసిన నేప‌థ్యంలో పోటీ ఉంటుంద‌ని అనుకున్నా.. ఇప్పుడు ఈ ప్ర‌భావం కూడాపెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. మేయ‌ర్‌గా ఆమె ఉన్న‌ప్ప‌టికీ.. కేవ‌లం కొన్ని ప్రాంతాల‌కే ఆమె ప‌రిమితం అయ్యారు. దీంతో ఆమె నామినేష‌న్ వేసినా.. ప్ర‌జ‌ల్లో ఊపు క‌నిపించ‌డం లేదు.

భాగ్య‌ల‌క్ష్మి గెలుపు వ్య‌క్తిగ‌తంగా కాకుండా.. పూర్తిగా పార్టీపైనే ఆధార‌ప‌డింది. ఇక‌, రాధా విష‌యానికి వ‌స్తే.. రెండు విష‌యాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

1) వ్య‌క్తిగ‌తంగా వంగవీటి రంగా వార‌సుడిగా ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ క‌లిసిరానుంది. పైగా.. విజ‌య‌వాడ‌లో ఆయ‌న తెలియ‌ని వారు లేరు. దీంతో ఆయ‌న గెలుపు ఈజీకానుంది.

2) జ‌న‌సేన ప్ర‌భావం. విజ‌య‌వాడ‌లో జ‌న‌సేన పార్టీ ప్ర‌భావంతోపాటు ప‌వ‌న్ ఇమేజ్ రెండూకూడా రాధాకు వ‌రంగా మార‌ను న్నాయి. దీంతో త్రిముఖ, ద్విముఖ అనే మాటేలేకుండా రాధా గెలుపు ఏక‌ప‌క్షంగా జ‌రిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

ఇక‌, మాజీ ఐపీఎస్ ఏబీవీ విష‌యానికి వ‌స్తే... ఆయ‌న ముఖ ప‌రిచ‌యం విజ‌య‌వాడ‌లో కొద్దిమందికే ఉంది. పోనీ.. క‌మ్యూనిస్టులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని అనుకున్నా.. ఈసీటుపై ఆశ‌లు పెట్టుకున్న చిగురుపాటి బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ వంటి సీనియ‌ర్ కామ్రెడ్లు అంత‌ర్గ‌తంగా కుమిలిపోతున్నారు. ఇది ఏబీవీకి మైన‌స్ కానుంది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ స‌హ‌క‌రిస్తుంద‌ని అనుకున్నా.. ఆ పార్టీ త‌ర‌ఫు విజ‌య‌వాడ‌లో బ‌ల‌మైన నాయ‌కుడు కానీ.. వాయిస్ కానీ లేకుండా పోయింది. ఇక‌, క‌మ్మ ఓటు బ్యాంకు ఉంది క‌దా! అంటే.. ఎంపీ కేశినేని శివ‌నాథ్ .. జ‌న‌సేన విష‌యంలో కీల‌కంగా మారిపోయారు. దీంతో క‌మ్మ ఓటు బ్యాంకును ఆయ‌న ప్రభావితం చేసి జ‌న‌సేన‌వైపు మ‌ళ్లించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తంగా విజ‌య‌వాడ‌లో ఏక‌ప‌క్ష పోటీ.. విజ‌య‌మేన‌ని అంటున్నారు.

Tags:    

Similar News