యుద్దం : అమెరికాకు నష్టం ఎంత ?!
2026 ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ మీద ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ ప్రారంభించాయి.
ఇరాన్ తో యుద్దం మూలంగా అమెరికా సైనిక విమానాలు, డ్రోన్లకు జరిగిన నష్టం రూ.32 వేల కోట్లు అని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఇది యుద్ద ఖర్చులో ఒక భాగం మాత్రమే. దీనికి మించి సైనిక ఖర్చు చాలా ఎక్కువ అని ఇతర నివేదికలు సూచిస్తున్నాయి.
రూ.32 వేల కోట్లు అనేది విమానాలు, డ్రోన్ల వరకు మాత్రమే అని, మొత్తం సైనిక ఖర్చు రూ.3 నుండి రూ.4 లక్షల కోట్ల వరకు ఉంటుందని సీఆర్ఎస్, సీబీఓ, పెంటగాన్ నివేదికలు తెలియజేస్తున్నాయి. యుద్దం కారణంగా అమెరికా సైనిక సామర్ధ్యంతో పాటు ఆర్థికంగా కూడా తీవ్రంగా ప్రభావితం అయినట్లు తెలుస్తుంది.
సైనిక ఆయుధాలు, కమ్యూనికేషన్ల రంగంలో దాదాపు 60 శాతం నష్టం జరిగిందని, ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్లు, వందలకొలదీ బేస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్, ఆపరేషనల్ ఇంధనం వంటి రంగాల మీద ఈ యుద్దం తీవ్రంగా ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయిల్ తో కలిసి ఇరాన్ మీద ‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ ప్రారంభించాయి.
ఇరాన్ అణు సౌకర్యాలు, సైనిక లక్ష్యాల మీద దాడులు జరిగాయి. ఇరాన్ ప్రతిదాడుల మూలంగా అమెరికాకు నష్టం వాటిల్తుతూ వస్తుంది. యుద్దంలో 81 అమెరికా సైనిక విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ధ్వంసం కావడం, దెబ్బతినడం జరిగింది. వీటి భర్తీ ఖర్చు రూ.16 వేల కోట్ల నుండి రూ.31 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. దెబ్బతిన్న వాటికి మరమ్మతులు నిర్వహించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు.
ఒక్కొక్కటి రూ.250 నుండి రూ.420 కోట్ల విలువైన 45 ఎమ్ క్యూ9 డ్రోన్లు దెబ్బతిన్నాయి. కువైట్ ఫ్రెండ్లీ ఫైట్, ఇరాన్ మీద, జోర్డాన్ బేస్ మీద దాడిలో 12ఎఫ్ - 15ఈ ఫైటర్ జెట్లు ఇరాన్ ప్రతిదాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం. రూ.90 మిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక 1 ఎఫ్ - 35 ఎ స్టెల్త్ ఫైటర్, 7 కేసీ -135 రిఫ్యూయలింగ్ విమానాలు క్రాష్ అయిన వాటిలో ఉన్నాయి.
ఇరాన్ ప్రతి దాడులలో కువైట్, బహ్రెయిన్, యూఏఈ, సౌదీ, ఇరాక్, ఒమన్, జోర్డాన్ లోని అమెరికా బేస్ లలో వందల భవనాలు, స్ట్రక్చర్లు దెబ్బతిన్నాయి. అత్యధిక ఫ్లైయింగ్ అవర్స్ కారణంా ఇంధనం ఖర్చు కావడంతో భారం పెరిగింది. ఇవన్నీ పునరుద్దరించాలంటే సంవత్సరాల పాటు సమయం పడుతుందని తెలుస్తుంది. మొత్తానికి యుద్దం మూలంగా అమెరికా నష్టపోవడంతో పాటు, ప్రపంచంలోని వివిధ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.