ఇక మీదట కేరళం....సర్వామోదం

కేరళ అంటూ ఇప్పటిదాకా అంతా పిలుస్తూ వస్తున్న ఆ రాష్ట్రం పేరు ఇక మీదట కేరళంగా మారబోతోంది. కేరళ రాష్ట్రం పేరుని మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2026-02-24 12:25 GMT

దక్షిణాదిన ఉన్న కేరళ రాష్ట్రం పేరుని కేంద్ర మంత్రి వర్గం కేరళంగా మారుతూ సర్వామోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సేవా తీర్ధ్ కొత్త బ్లాక్ లో తొలిసారిగా సమావేశం అయిన కేంద్ర మంత్రి వర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ అంటూ ఇప్పటిదాకా అంతా పిలుస్తూ వస్తున్న ఆ రాష్ట్రం పేరు ఇక మీదట కేరళంగా మారబోతోంది. కేరళ రాష్ట్రం పేరుని మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

చట్ట ప్రకారంగా అంతా :

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత భారత రాష్ట్రపతి కేరళ పేరు మార్పు బిల్లు, 2026 ను తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కేరళ రాష్ట్ర శాసనసభకు నివేదిస్తారు. ఆ మీదట కేరళ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తిరిగి కేంద్ర ప్రభుత్వం వద్దకు బిల్లు వస్తుంది. అలా కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఇక కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చడానికి ఉద్దేశించిన కేరళ పేరు మార్పు బిల్లు- 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి సిఫార్సును కోరుతుంది. అలా పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇదంతా ఒక ప్రక్రియగా సాగనుంది. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చడానికి కేరళ శాసనసభ 2024 జూన్ 24న తీర్మానాన్ని ఆమోదించింది.

స్వాతంత్ర్యం వచ్చాక :

ఇదిలా ఉంటే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాగా తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ ప్రాంతాన్ని వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో కొత్త అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇఎంఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటి వాటిలో ఇది ఒకటిగా ఉంది.

Tags:    

Similar News