ట్రంప్ పరిస్థితి దారుణం.. ఇరాన్ దూకుడు.. ఏం జరుగుతుంది?
ఇక, ట్రంప్ పరిస్థితి దారుణంగా తయారైందని గ్రహించిన ఇరాన్.. కాంగ్రెస్ అనుమతి ఉంటే తప్ప..;
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నిన్న మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించారు. ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. అంతేకాదు.. ఇరాన్‌ను అడ్రస్ లేకుండాచేస్తామని కూడా చెప్పారు. కానీ, ఆయన దూకుడు ఇప్పుడు దారుణంగా తయారైంది. దీనికి కారణం.. అధ్యక్షుడిగా ఆయనకు ఉండే ప్రత్యేక అధికారులు.. ముఖ్యంగా యుద్ధం విషయంలో 60 రోజులు మాత్రమే. ఫిబ్రవరి 28న ప్రారంభించిన ఇరాన్ యుద్ధంలో మార్చి, ఏప్రిల్ 29తోనే ఆయనకు ఉన్న ఈ అధికారులు ముగిసిపోయాయి.
ఇక, యుద్ధం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే.. మళ్లీ చట్టసభలను కొలువుదీర్చి.. కాంగ్రెస్ అనుమతితో(ప్రతిపక్షం) ఆయన ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ మరోసారి యుద్ధానికి అనుమతి ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో ట్రంప్ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పైగా.. ఇప్పటికే తాను 9 అంశాలతో ఇరాన్‌ను వర్తమానం పంపించానని.. దానిపై ఇరాన్ ఎటూ తేల్చలేదని చెబుతున్నారు.
ఇక, ట్రంప్ పరిస్థితి దారుణంగా తయారైందని గ్రహించిన ఇరాన్.. కాంగ్రెస్ అనుమతి ఉంటే తప్ప.. ట్రంప్ అడుగులు వేసే పరిస్థితి లేదని తెలిసిన ఇరాన్.. తాజాగా 14 అంశాలతో అమెరికాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. వీటిలో ప్రధానంగా వచ్చే 30 రోజుల్లోనే పూర్తిస్థాయిలో యుద్ధాన్ని నిలువరించాలని ప్రధాన షరతు పెట్టింది. అంతేకాదు.. తమకు విదేశాల్లో ఉన్న ఆస్తులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయా లని, తమ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను తీసేయాలని కూడా షరతు విధించింది.
యుద్ధానికి తాత్కాలిక విరామం కాదని.. పూర్తిస్థాయిలో విరామం ప్రకటించాలని కూడా ఇరాన్ తేల్చి చెప్పింది. తమ భూభాగంపై ఉన్న అమెరికా సేనలను కూడా వెనక్కి పిలవాలని.. హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణే కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇరాన్ పెట్టిన షరతులను కాంగ్రెస్ పక్షం సానుకూల ధోరణితో ఉండగా.. ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తాను త్వరలోనే సమీక్షిస్తానని చెప్పారు. కానీ.. గతంలో అయితే.. ఆయన ఎలాంటి పరిస్థితిలోనూ ఇరాన్ పెట్టిన షరుతులు సమీక్షించేది లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.