వెనిజువెలాపై 'రహస్య' ఆయుధం... ట్రంప్ నుంచి షాకింగ్ విషయం!
వెనిజువెలాలోని చమురు క్షేత్రాలపై మనసుపడిన డొనాల్డ్ ట్రంప్.. వాటిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఆ దేశాధ్యక్షుడిపై డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు చేశారు.;
వెనెజువెలాపై మెరుపుదాడి చేసి ఆ దేశ నేత నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించిన సంగతి తెలిసిందే. అమెరికాకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపించిన తర్వాత జనవరి 3న ఆయనను అరెస్టు చేశారు. అయితే.. ఈ ఆరోపణలను కారకాస్ పదేపదే ఖండించింది. మదురో నివాసంపై జరిగిన దాడిలో కనీసం 100 మంది మరణించారని వెనిజువెలా అంతర్గత మంత్రి తెలిపారు. ఆ సమయంలో ఓ వెనుజువెలా సైనికుడు వెల్లడించిన విషయాన్ని ఇప్పుడు ట్రంప్ కన్ఫాం చేశారు.
అవును... వెనెజువెలాపై మెరుపుదాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించిన సమయంలో.. అగ్రరాజ్యం ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది అత్యంత భయంకరమైన పరిణామాలను తెరపైకి తెచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా.. వెనిజువెలాలో సీక్రెట్ సోనిక్ వెపన్ ను వినియోగించినట్లు ధ్రువీకరించారు. తమ వద్ద మాత్రమే ఈ తరహా శక్తిమంతమైన ఆయుధం ఉందని చెప్పుకొచ్చారు!
వెనిజువెలాలోని చమురు క్షేత్రాలపై మనసుపడిన డొనాల్డ్ ట్రంప్.. వాటిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఆ దేశాధ్యక్షుడిపై డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు చేశారు. ఈ సమయంలో.. నేరుగా అతని నివాసంపై దాడి చేశారు. ఆ సమయంలో.. యూఎస్ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని వాడిందంటూ.. ఆ మాజీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా పనిచేసిన గార్డ్ చెప్పిన వివరాలు ప్రపంచాన్ని షాక్ కి గురిచేశాయి. వీటిపై తీవ్ర చర్చ జరిగింది.
ఈ విషయాలపై స్పందించిన గార్డ్... ఆ సోనిక్ ఆయుధం ముందు తాము నిల్చోలేకపోయామని.. మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైందని.. కొందరు వాంతులు చేసుకున్నారని.. ఇంకొందరు నేలపై పడిపోయారని.. తాము ఎంతమందిమి ఉన్నా, అచేతనులమైపోయామని.. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుందని ఆందోళన వ్యక్తంచేశాడు. దీంతో... ఈ విషయంపై చర్చ మరింత తీవ్రంగా జరిగింది.
పైగా ఈ గార్డ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే దావోస్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ.. 'మన దగ్గర ఎవరికీ తెలియని ఆయుధాలు చాలానే ఉన్నాయి.. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని నేను భావిస్తున్నాను.. అదొక అద్భుతమైన దాడి' అని అన్నారు.
ఇదే సమయంలో... నేరస్థులను, ఫెంటానిల్ ను వెనిజువెలా నేత మదురో అమెరికాకు పంపుతున్నాడనే (ఆధారాలు లేని) వాదనలను పునరావృతం చేసిన ట్రంప్.. ఈ ఆపరేషన్ ను సమర్థించారు. వెనిజువెలా చమురు రంగాన్ని అభివృద్ధి చేయడంలో అమెరికా కీలక పాత్ర పోషించాలని అన్నారు. మరోవైపు... ఈ రహస్య ఆయుధం గురించి మరింత సమాచారం ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా స్పందించిన క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్... ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలించే పని మాస్కో ప్రత్యేక సేవలకు అప్పగించబడిందని అన్నారు!