అద్దె ఇంటికి 30 లక్షలు అడ్వాన్స్ .....వామ్మో !

ఈ దేశంలో చాలా కోట్ల మంది ప్రజలకు సొంత ఇల్లు లేదు. అందరికీ ఇళ్ళు అన్నది రాజకీయ పార్టీల అందమైన నినాదంగానే ఎపుడూ ఉంటుంది.;

Update: 2025-11-04 03:54 GMT

ఈ దేశంలో చాలా కోట్ల మంది ప్రజలకు సొంత ఇల్లు లేదు. అందరికీ ఇళ్ళు అన్నది రాజకీయ పార్టీల అందమైన నినాదంగానే ఎపుడూ ఉంటుంది. దాంతో పేదలు మధ్యతరగతి వర్గాలకు అద్దెలు మద్దెల దరువుగానే ఉంటున్నాయి. ఇక కాస్ట్లీ సిటీలలో చూస్తే అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. మోత మోగిస్తాయి. ఇక దేశంలో జీవన వ్యయంలో ఏది ఎక్కవ కాస్ట్లీ సిటీ అంటే ఆ నగరాల జాబితలో బెంగళూరు ని కూడా చెబుతారు ఈ సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఐటీ దిగ్గజ నగరం. అందుకే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెబుతారు.

సాఫ్ట్ వేర్లతో అలా :

బెంగళూరులో చూసుకుంటే సాఫ్ట్ వేర్ సెక్టార్ బాగా ఉంటుంది. దాంతో అక్కడ వారికి వచ్చే ఆదాయాలు జీతాలు అన్నీ చూసి ఇంటి అద్దెలు భారీగా పెంచేస్తూంటారు అక్కడ ఒక అద్దె ఇల్లు తీసుకోవాలంటే వేలల్లో పోయాల్సిందే అని అంతా ఎరిగిన విషయమే అయితే తాజాగా ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చూస్తే ఇంతలా వాయించేస్తారా అన్నది తెలిసి అంతా షాక్ కి గురి అవుతున్నారు. ఇంతకీ ఆ నెటిజన్ పెట్టింది ఏంటి అంటే అద్దే కోసం ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కి ఏకంగా సెక్యూరిటీ డిపాజిట్ కింద ముప్పై లక్షలు ఓనర్ డిమాండ్ చేశాడుట.

అద్దే ఓకే కానీ :

ఇంతకీ ఈ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ ప్రాంతంలోనట. ఇక్కడ డబుల్ బెడ్రూం ఫ్లాట్ కి ఇరవై వేల రూపాయలు నెల అద్దె అని చెప్పాడట ఓనర్. అది ఓకే అనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అని కొత్త డిమాండ్ పెట్టడమే కాకుండా ఏకంగా ముప్పయి లక్షలు ఇవ్వాలని కోరడంతో అద్దె కోసం వచ్చిన ఆ నెటిజన్ కి మతి పోయిందంట. ఎక్కడా లేని విధంగా సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఇంత పెద్ద మొత్తం అది కూడా మూడు పదుల లక్షలు డిమాండ్ చేయడమేంటి అని సోషల్ మీడియాలో ఒక్కటే రచ్చ సాగుతోంది.

ఫ్లాటే వస్తుందిగా :

నిజంగా అంత సొమ్ము ఉంటే అదే పెట్టుబడిగా పెడితే హాయిగా ఫ్లాట్ ఒకటి వస్తుందిగా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా బిగ్ డిబేట్ పెట్టి మరీ అంటున్న మాట. నెలకు ఇచ్చే ఇరవై వేల రూపాయల అద్దెతో నెలవారీ వాయిదాలను కట్టి హాయిగా ఏదో నాటికి ఇంటి ఓనరే కావచ్చు కదా అంటున్నారు. మరీ ఆశలు ఇంత రేంజిలోనా అని కూడా విమర్శిస్తున్న వారూ ఉన్నారు.

పేయింగ్ గెస్ట్ బెటర్ :

ఇలా ఫ్లాట్స్ కోసం తిరగడం అద్దెలు సెక్యూరిటీ డిపాజిట్లు అంటూ తలకు బొప్పి కట్టించుకోవడం కంటే పేయింగ్ గెస్ట్ గా ఉండడం బెటర్ అని మరి కొందరు నెటిజన్లు అంటున్నారు ఇక బెంగళూరు పరిస్థితిని అంతా చర్చించుకుంటున్నారు. అక్కడ వైట్ ఫీల్డ్ వంటి ప్రాంతాలలో మంచి ఇల్లు అద్దెకి రీజనబుల్ రెంట్ కి దొరకడం కష్టమని అంటున్నారు ఇదంతా బెంగళూర్ లో ఐటీ ఫీల్డ్ ని చూసుకుని పెంచుతున్నది కృత్రిమంగా ఏర్పడిన డిమాండ్ గా కూడా అంటున్నారు. దీనిని బట్టి తేలేది ఏమిటి అంటే మంచి కాస్ట్లీ సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలు కోటీశ్వరులు అయిపోవచ్చు అన్న మాట. అద్దెల దరువుతో డిమాండ్ పెట్టి మరీ లాగాల్సింది లాగేయవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా టూ మచ్ బాబూ అనే అందరి మాట మరి. అయినా ఆగేది ఏముంది. ఈ అద్దె బెంగ తీరేది ఏముంది అన్నది మరో మాట.

Tags:    

Similar News