చెప్పు తెగుద్ది....రాప్తాడు రాజుకుంది

ఇదిలా ఉంటే రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదర్తిగా రాజకీయం ఎపుడూఒ హీటెత్తిపోతుంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంటోంది.;

Update: 2025-10-05 12:41 GMT

రాజకీయలలో భాష మారిపోతోంది. విమర్శలు ప్రతి విమర్శలు అన్నవి హుందాగా ఉండటం లేదు అని అంతా అనుకుంటూనే ఉన్నారు ఇక రాయలసీమలో రాజకీయం వేడెక్కేలా సాగుతుంది. ఇదిలా ఉంటే రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదర్తిగా రాజకీయం ఎపుడూఒ హీటెత్తిపోతుంది. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంటోంది.

పరిటాల టాక్స్ అంటూ :

రాప్తాడు లో పరిటాల టాక్స్ తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు అని తోపుదుర్తి తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతీ పనికీ ఇంత అని కమిషన్ వసూల్ చేస్తున్నారు అన్నారు ఇది ఆఖరుకు ప్రభుత్వ ఇళ్ళ నిర్మాణం దాకా వెళ్ళిందని వారి నుంచి కూడా కమిషన్లు వసూల్ చేస్తున్నారు అన్నారు. ప్రతీ లబ్దిదారుడి నుంచి కనీసంగా పది వేల రూపాయలు తీసుకుంటున్నారు. పేదలైన లబ్దిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పరిటాల శ్రీరాం టీడీపీ ఇంచార్జిగా ఉన్న ధర్మవరంలోనూ బలవంతపు వసూళ్ళు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తాజాగా జరిగిన ఆయుధ పూజలో ఎనిమిది కార్లు గన్ లను పూజించారు అని ఇదంతా ఎక్క్డ నుంచి వచ్చిన సొమ్ము అని ఆయన నిలదీశారు.

చెప్పు తెగుద్ది అంతే :

ఇక తోపుదుర్తి చేసిన ఆరోపణలను పరిటాల సునీత ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అని ఆమె హెచ్చరించారు. వైసీపీ వారికి ఈ తరహా వసూళ్ళు అలవాటేమో కానీ పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేసారు. తాము ఎపుడూ పది మందికి పెట్టే వారమే కానీ తీసుకునే వారం కాదని అన్నారు. ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటు హెచ్చరిక జారీ చేశారు.

విచారణకు డిమాండ్ :

టీడీపీ కూటమి నేతలు ఎమ్మెల్యేలు కమిషన్లు దండుకుంటున్నారు అని మరోసారి తోపుదుర్తి ఆరోపించారు. తాను ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సింది పోయి చెప్పు తెగుద్ది అనడమేంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేల అవినీతి మీద విచారణ జరిపించే సత్తా కూటమి ప్రభుత్వం పెద్దలకు ఉందా అని సవాల్ చేశారు. ధర్మవరంలో కూడా చేనేత వ్యాపారులను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఉన్న విషయాలు చెబుతే బెదిరిస్తారా అని తోపుదుర్తి మండిపడ్డారు

మాటల యుద్ధం :

ప్రభుత్వ హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిని చెప్పు తెగుద్ది అని ఎమ్మెల్యే హోదాలో ఉన్న పరిటాల సునీత బెదిరించడం ఏమిటని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే కనుక రాప్తాడులో ఈ చెప్పు తెగుద్ది మాటల యుద్ధం అయితే సాగుతోంది. ఎవరు ఎవరిని ఏమి అయినా విమర్శలు చేసుకోవచ్చు అన్న కల్చర్ పెరిగాక వీటిని వింటూ ఉండడమే జనాలకు అలవాటుగా మారింది అని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ రాజకీయ సంవాదాలు మరింతగా పెరిగే అవకాశాలే ఉంటాయి తప్ప తగ్గేది లేదని అంటున్నారు.

Tags:    

Similar News