కాళేశ్వరం ఎఫెక్ట్: సర్కారు ముందున్న ఆప్షనేంటి?
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. లక్ష కోట్ల రూపాయలకు పైగానే దోచుకున్నారని ఆరోపిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీబీఐకి ఆదేశించారు.;
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. లక్ష కోట్ల రూపాయలకు పైగానే దోచుకున్నారని ఆరోపిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీబీఐకి ఆదేశించారు. అయితే.. అసలు కమిషన్ రిపోర్టుపైనే సందేహా లు ఉన్నప్పుడు.. దీని ఆధారంగా విచారణకు ఆదేశించడం సరికాదని పేర్కొంటూ హైకోర్టు దీనిని తోసిపు చ్చింది. ఈ క్రమంలో సర్కారు ముందున్న ఆప్షన్లు ఏంటి? ఏం చేయాలి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం సర్కారుకు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
1) ఎన్డీఎస్ ఏ నివేదిక: జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్‌డీ ఎస్ ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఇప్పుడు విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జలశక్తి శాఖ ఇచ్చింది. గత ఆరుమాసాల్లో రెండుసార్లు పరిశీలించిన ఎన్డీ ఎస్ ఏ అధికారులు ఈ నివేదికను రూపొందిం చారు. దీనిలో ప్రధానంగా మేడిగడ్డ కాదు.. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టును ప్రారంభించలేదని పేర్కొన్నారు . అవినీతి కంటే కూడా.. దీనిలో టెక్నికల్ అంశాలను ప్రస్తావించారు.
కాబట్టి.. ఎన్డీఎస్ ఏ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టినా.. దీనిలో అవినీతి జరిగిందని కానీ.. గత ప్రభుత్వ పెద్దల ప్రాధాన్యం ఉందని కానీ.. ఎన్‌డీఎస్ ఏ నివేదిక పేర్కొనలేదు. కేవలం.. నిర్మాణం, సాంకే తిక అంశాలను, నీటి లభ్యతను మాత్రమే ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐని వేసినా.. రేవంత్ సర్కారులక్ష్యంగా పెట్టుకున్న అవినీతిని వెలికితీయడం.. సొమ్ములు వెనక్కి రప్పించడం సాధ్యం కాకపోవచ్చన్న చర్చ ఉంది.
2) ప్రజల్లోకి వెళ్లడం: కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని సభలో పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు.. ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో బీఆర్ ఎస్ కూడా.. తన సత్తా మేరకు ఎదురు దాడి చేయడం ఖాయం. ఇక, మూడో ఆప్షన్.. సిట్ వేయడం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ వేస్తే.. హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్నిఏర్పాటు చేయడం ద్వారా.. దీనిపై కొంత మేరకు పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్లే ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.