జూబ్లీహిల్స్ ఉప పోరు.. టీడీపీ మ‌ద్ద‌తుపై చ‌ర్చ‌.. !

ఈ స్థానం నుంచి 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ నాయ‌కుడు మాగుంట గోపీనాథ్ విజ‌యం ద‌క్కించుకున్నారు.;

Update: 2025-09-11 21:30 GMT

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉన్న కీల‌క అసెంబ్లీ స్థానం జూబ్లీహిల్స్‌. ఈ స్థానం నుంచి 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ నాయ‌కుడు మాగుంట గోపీనాథ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న అనారోగ్య కార‌ణాల‌తో అకాల మ‌ర‌ణం చెందారు. దీంతో త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుం ది. దీనిని అధికార పార్టీ కాంగ్రెస్ స‌హా.. విప‌క్షాలు బీఆర్ ఎస్‌, బీజేపీలు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నా యి. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం.. సినీ ప‌రిశ్ర‌మకు చెందిన వారంతా అక్క‌డే ఉండ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రింత ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం .. టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లే. జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నిక‌పై స్పందించిన నారా లోకేష్‌.. అక్క‌డ తాము నేరుగా పోటీ చేయ‌బోమ‌ని చెప్పారు. అయితే .. పోటీలో ఉన్న ప్ర‌దాన పార్టీకి మాత్రం త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని.. దీనిపై పార్టీ అధినేత చంద్ర‌బాబు అంద‌రితోనూ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. నాయ‌కుల ప‌రంగా సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రేవంత్ రెడ్డి.. టీడీపీ మ‌నిష‌నే పేరుంది. గ‌తంలో ఆయ‌న చంద్ర‌బాబు శిష్యుడిగా కూడా .. పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయ‌న కోరితే.. చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ఇస్తార‌న్న చ‌ర్చ ఉంది. కానీ, ఇదేస‌మ‌యంలో కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ బీజేపీతో క‌లిసి ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై బీజేపీ కూడా ఒత్తిడి పెంచే అవ‌కాశం ఉంది. తాజాగా జ‌రిగిన రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో తెలుగువారైన జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డిని కూడా కాద‌ని.. బీజేపీ నిల‌బెట్టిన రాధాకృష్ణ‌న్‌కే చంద్ర‌బాబు మొగ్గు చూపారు.

అంతేకాదు.. ఏపీలో త‌మ కూట‌మి(బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ)మ‌రిన్ని కాలాల పాటు అధికారంలో ఉంటుంద ని కూడా చంద్ర‌బాబు చెబుతూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో బీజేపీని వ‌దులుకునే అవ‌కాశం లేదు. పైగా.. కేంద్ర మంత్రి బండి సంజ‌య్ వంటివారు.. త‌ర‌చుగా ఏపీలో పాల‌న‌ను ప్ర‌శంసిస్తున్నారు. దీంతో బాబును బీజేపీ కోరితే.. ఖ‌చ్చితంగా ఆ పార్టీకే జూబ్లీహిల్స్‌లో మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంటుంది. ఇక‌, టీడీపీ బ‌లాబ‌లాను గ‌మ‌నిస్తే.. సెటిల‌ర్లు, పెట్టుబ‌డి దారులు ఎక్కువ‌గా ఉన్న జూబ్లీహిల్స్‌లో టీడీపీకి మ‌ద్ద‌తు ఉంది. ఇది ఆ పార్టీకి.. క‌లిసి వ‌స్తుంది. అందుకే.. టీడీపీ మ‌ద్ద‌తు కీల‌కంగా మారింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News