ట్రాఫిక్ చలాన్ల పెండింగ్ సొమ్ముతో 'పోలవరం' కట్టేయొచ్చు!
దీంతో ట్రాఫిక్ చలాన్లను.. రెట్టింపు చేశారు. ఇది జరిగి కూడా.. రెండేళ్లు అయిపోయింది. తరచుగా రహదారులపై పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘటనలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారు గత పదేళ్లలో 70 శాతానికి చేరారని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతు న్నాయి. రెడ్ సిగ్నల్స్ ఉల్లంఘించడ.. ఓవర్ టేక్, మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం.. సహా.. ర్యాష్ డ్రైవింగ్, కార్లలో అయితే సీటు బెల్టు పెట్టుకోకపోవడం.. బైకులైతే.. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటివి గత దశాబ్ద కాలంలో పెరుగుతున్న ఘటనలుగా కేంద్ర లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రమాదాలకు ఎక్కువగా ఆస్కారం ఉంటోందని.. మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయని అంటోంది.
దీంతో ట్రాఫిక్ చలాన్లను.. రెట్టింపు చేశారు. ఇది జరిగి కూడా.. రెండేళ్లు అయిపోయింది. తరచుగా రహదారులపై పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘటనలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. చలాన్లు రాస్తున్నారు. అయితే.. ఈ చలానాలు రాసినా.. తర్వాత కట్టొచ్చు.. అనే చిన్న నిబంధన కారణంగా.. వాహనదారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో తరచుగా అవే ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. పైగా ఎంత చేసినా.. ఏం చేసినా.. డబ్బుతో అన్నీ మాఫీ అవుతున్నాయన్న ధీమా కూడా ఉంటోంది.
ఇదే విషయంపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ 75 వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్మును పోలీసులు విధించారు. దీనిలో 42 వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు కావాల్సి ఉంది. ఈ విషయాన్నే కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. 75 వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్ము వసూలు కావాల్సి ఉంటే.. దీనిలో 33 వేల కోట్ల రూపాయలు మాత్రమే వసూలు అయిందని పేర్కొంది.
దీంతో సీరియస్ అయిన.. సుప్రీంకోర్టు.. ఆ సొమ్మును వసూలు చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయని తెలిపింది. విద్యుత్ బిల్లులు ఠంచను గా కడుతున్నప్రజలు.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో.. ఆలోచించాలని సూచించింది. దీనికి పరిష్కారంగా.. ఆయా ట్రాఫిక్ చలాన్ల ఎమౌంటును నెలవారీ కరెంటు బిల్లులో కలిపి వసూలు చేసుకునేలా విధానం రూపొందించాలని రాష్ట్రాలకుసూచించింది. అవసరమైతే.. బండ్లు స్వాధీనం చేసుకునేలా.. రిజిస్ట్రేషన్ నిలుపుదల, లైసెన్సు రద్దు వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని కోరింది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం అంటే.. తమకు తాము ప్రమాదాలు కొని తెచ్చుకోవడంతోపాటు.. తమతోటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు తీసుకురావడమేనని వ్యాఖ్యానించింది. ఈ విధానంపై వచ్చే నెల 13లోగా కోర్టుకు వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించడం గమనార్హం. కాగా.. ట్రాఫిక్ చలాన్ల పెండింగ్ సొమ్ముతో పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తవుతాయని.. ఈ సందర్భంగా న్యాయవాది చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సమర్థించింది.