స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్ అయ్యారు.. ఉత్కంఠగా వాట్ నెక్స్ట్?
టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన్న వివాహం ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే.;
టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన్న వివాహం ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అందుకు ప్రధాన కారణం ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరడమే! ఈ క్రమంలో తాజాగా ఆ కుటుంబానికి గుడ్ న్యూస్ వచ్చింది. ఇందులో భాగంగా... స్మృతి తండ్రి తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి, క్షేమంగా ఉన్నట్లు ప్రకటన వచ్చింది!
అవును... స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఆయన క్షేమంగా ఉన్నారని ప్రకటన వచ్చింది. దీంతో.. స్మృతి కుటుంబం ఫైనల్ గా కొంత ఉపశమనం పొందినట్లయ్యింది. ఆదివారం నాడు తీవ్రమైన ఛాతి నొప్పితొ బాధపడుతున్న శ్రీనివాస్ ను సాంగ్లి ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. దీంతో.. స్మృతి వివాహ వేడుక అకస్మాత్తుగా వాయిదా పడింది.
అయితే, జాతీయ మీడియా నివేదికల ప్రకారం... శ్రీనివాస్ మంధాన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని.. ఆయనకు ఇకపై ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ముందు జాగ్రత్త చర్యగా ఆయనకు యాంజియోగ్రఫీ నిర్వహించినట్లు వైద్యులు చెబుతున్నారు. అతని గుండె ఆరోగ్యం గురించి ఎలాంటి అడ్డంకులు లేవని వెల్లడించారు! ఇది స్మృతి కుటుంబానికి అతి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి!
వాట్ నెక్స్ట్?:
స్మృతి, పలాశ్ వివాహ వేడుకలు శ్రీనివాస్ అనారోగ్యానికి గురైన తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా... స్మృతి తన తండ్రికి చాలా దగ్గరగా ఉంటుందని.. తన తండ్రి కోలుకునే వరకూ ఈ వివాహం నిరవధికంగా వాయిదా వేయాలని ఆమె నిర్ణయించుకుందని పేర్కొన్నారు.
వాస్తవానికి శ్రీనివాస్ కు గుండెపోటు కాదని.. ఆంజినా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని డాక్టర్ సమన్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ఎడమ వైపు ఛాతిలో నొప్పి ఉండటంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందని ఆయన నివేదించారు. మరోవైపు... స్మృతికి కాబోయే భర్త పలాశ్ కూడా అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరారు. దీంతో ఇద్దరి డిశ్చార్జ్ తర్వాత అప్ డేట్ కోసం అంతా చూస్తున్నారు.
అయితే తాజాగా స్మృతి తండ్రి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం, ఆయన క్షేమంగా ఉన్నారని, ఆయన గుండెకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటన వచ్చినప్పటికీ... ఆ కుటుంబం నుంచి ఇంకా సరికొత్త వివాహ తేదీ ప్రకటన రాలేదు! ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి రెండు కుటుంబాలు వేడుకల కంటే ముందు వారి వారి అరోగ్యం, పూర్తిగా కోలుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని అంటునారు.
సోషల్ మీడియా ప్రచారం వేళ.. వాట్ నెక్స్ట్?
స్మృతి, పలాశ్ ల వివాహం నిరవధికంగా వాయిదా పడటానికి కారణం ఆమె తండ్రి అనారోగ్యంగా ఉండటం మాత్రమే కాదని చెబుతూ మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మరో అమ్మాయితో పలాశ్ చాటింగ్ చేశాడనే విషయం స్మృతికి తెలిసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలో... అయితే స్మృతి జస్ట్ మిస్సన్నమాట, గాడ్ బ్లెస్ హెర్ అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే... అదంతా తప్పుడు ప్రచారం అని, కేవలం అనారోగ్య కారణాలతోనే వారి వివాహం వాయిదా పడిందని మరికొంతమంది స్పందిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో... వీరి వివాహానికి సంబంధించిన ప్రకటన ‘ఏ విధంగా’ ఉండబోతోంది అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది.