టాప్ హీరోయిన్ బోల్డ్ ఫోటో వివాదంలో సోద‌రుడు 200 మందితో ఘ‌ర్ష‌ణ‌

90ల‌లో సెన్సేష‌ల్ బ్యూటీగా పాపుల‌రైన ప్ర‌ముఖ హిందీ న‌టి అర్థ న‌గ్న ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతూ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేది.

Update: 2026-09-30 16:30 GMT

90ల‌లో సెన్సేష‌ల్ బ్యూటీగా పాపుల‌రైన ప్ర‌ముఖ హిందీ న‌టి అర్థ న‌గ్న ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతూ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేది. ఒకే ఒక్క‌సారి అర్థ‌న‌గ్న ఫోటోషూట్‌తోను షాకిచ్చింది. త‌న ఎద అందాలను పబ్లిగ్గా ప్ర‌ద‌ర్శిస్తూ బాడీ పెయింట్ ఆర్ట్ ని ప్ర‌ద‌ర్శించ‌డం ఆరోజుల్లో క‌ల‌క‌లం రేపింది. ఏం చేస్తే అటెన్ష‌న్ త‌న‌వైపు తిప్పుకోవ‌చ్చో అది చేయ‌డానికి ఏమాత్రం వెన‌కాడ‌ని న‌టీమ‌ణిగా, మైండ్ ప్లేయ‌ర్ గా ఈ న‌టికి గుర్తింపు ఉంది. ఇంత‌కీ ఎవ‌రీ న‌టి? అంటే.. పేరు పూజా భ‌ట్. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేష్ భ‌ట్ కుమార్తె. ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

బాలీవుడ్ ప్రముఖ నటి పూజ భట్ 1990లలో చేసిన ఒక బోల్డ్ బాడీ-పెయింట్ ఫోటోషూట్ ఆ కాలంలో పెను సంచ‌ల‌నానికి తెర తీసింది. అయితే ఆ ఫోటోషూట్ కారణంగా కొందరు వ్యక్తులు తమ నివాసం వద్దకు వచ్చి నిరసనలు తెలిపారని.. ఆ సమయంలో తన సోదరిని కాపాడుకోవడానికి తాను కొందరిని కొట్టాల్సి వచ్చిందని ఆమె తమ్ముడు రాహుల్ భట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆ కాలంలో పూజ భట్ ఫోటోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని.. దాదాపు 200 మంది నిరసనకారులు తమ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారని రాహుల్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో తండ్రి మహేష్ భట్ లేరని.. కేవలం తాను మాత్రమే ఉన్నానని తెలిపారు. కొందరు నిరసనకారులు బలవంతంగా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో తన తల్లి తీవ్ర ఆందోళన చెందిందని.. అందుకే తాను వారిని అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

తన సోదరి పూజ భట్ ఏ పని చేసినా అందులో ఒక కళాత్మకత ఉంటుందని.. ఆ ఫోటోషూట్ కూడా ఎలాంటి అశ్లీల‌త లేకుండా చాలా క్లాసీగా ఉందని రాహుల్ సమర్థించారు. కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన సోదరిని కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని.. అందుకే ఆమెను ఎవరైనా ఇబ్బంది పెడితే తాను సహించలేనని స్పష్టం చేశారు.

మహేష్ భట్ కుటుంబం ఎదుర్కొన్న వివాదాలు.. విమర్శల గురించి మాట్లాడుతూ ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే తమ కుటుంబం బలమైన బంధంతో నిలబడిందని తెలిపారు. చిన్ననాటి నుంచే ఇలాంటి వివాదాలను చూస్తూ పెరగడం వల్ల ప్రజల విమర్శలు తనపై పెద్దగా ప్రభావం చూపలేదని ఆయన పేర్కొన్నారు.

సినిమా రంగంలో పూజ భట్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని.. తండ్రి లెగసీని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారని రాహుల్ కొనియాడారు. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.

పూజా భ‌ట్ త‌ర్వాత షెర్లిన్, రాధిక ఆప్టే...!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు బో*ల్డ్ న్యూ*డ్ లేదా అర్ధనగ్న ఫోటోషూట్లు ఆ కాలంలో తీవ్ర సంచలనం సృష్టించడంతో పాటు పెద్ద ఎత్తున వివాదాలకు దారితీశాయి. 1990లలో పూజ భట్ తన సోదరితో కలిసి లేదా సొంతంగా చేసిన కొన్ని ఆర్టిస్టిక్ బాడీ-పెయింట్ ఫోటోషూట్లు అప్పట్లో పబ్లిక్‌లో తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నాయి. ఆ ఫోటోల కారణంగా ఆమె కుటుంబం ఇళ్ల వద్ద ఆందోళనలను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.

అదేవిధంగా ప్రముఖ నటి రాధికా ఆప్టే తన కెరీర్‌లో భాగంగా చేసిన కొన్ని డిజిటల్ షార్ట్ ఫిల్మ్స్- ఫోటోషూట్‌లకు సంబంధించిన ఫోటోలు లీకై పెద్ద వివాదానికి కారణమయ్యాయి. అలాగే మిల్టన్ మంచెట్టా, షెర్లిన్ చోప్రా వంటి కొందరు నటీమణులు మ్యాగజైన్ కవర్ల కోసం... డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల కోసం చేసిన పూర్తి న్యూడ్ ఫోటోషూట్లు సోషల్ మీడియాలోనూ, చట్టపరంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారి విమర్శలను మూటగట్టుకున్నాయి.

Tags:    

Similar News