పులివెందుల స్థానిక పోరు.. జగన్కు బిగ్ టెస్టే..!
కానీ అటు వైసిపి ఈ ప్రాంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న వ్యూహంతో ముందుకు సాగుతూ ఉండడం గమనార్హం.
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ భారీ ట్విస్టులతో ముడిపడిందనే చెప్పాలి. వైసీపీ తరఫున ఇప్పటికే మహిళ నాయకురాలు, జగన్ బంధువు టికెట్ సంపాదించుకున్నారు. నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక, టీడీపీ కూడా ఈ సీటును మహిళకు ఎంపిక చేశారు. దీంతో వైసిపి- టిడిపి మహిళా నాయకురాళ్ల మధ్య తీవ్రస్థాయిలో పోటీ అయితే ఉండనంది. ఇందులో ప్రధానంగా గమనించాల్సింది పులివెందుల మున్సిపాలిటీని దక్కించుకోవడం జగన్ కి ఇప్పుడు అత్యంత కీలకం.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకోకపోతే అది మరింత ఇబ్బందికర పరిణామాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల పరిస్థితులను చూసుకుంటే ఇరుపక్షాల మధ్య కూడా దాడులు జరిగాయి. అలాగే మాటల తూటాలు.. వ్యూహ ప్రతివ్యూహాలు కూడా ఇరు పక్షాల మధ్య కామన్ గా మారిపోయింది. మహిళా నాయకులు పోటీలో ఉన్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందా.. లేకపోతే సర్దుబాటు అవుతాయా అనేది చూడాలి.
కానీ అటు వైసిపి ఈ ప్రాంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న వ్యూహంతో ముందుకు సాగుతూ ఉండడం గమనార్హం. అలాగే టిడిపి కూడా జగన్ నియోజకవర్గంలో తాము పాగా వేయాలని నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న వ్యూహాన్ని టిడిపి వైసిపిలు అనుసరిస్తున్నాయి. వైసీపీ తరఫున బరిలోకి దిగిన జగన్ చిన్నమ్మ వైయస్ ప్రమీల టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన తుగుట్ల గీతా కుమారి ఇద్దరు సీనియర్ నాయకులు కావడం గమనార్హం.
అంతేకాదు.. ఇరువురికి స్థానికంగా బలమైన ఫాలోయింగ్ ఉండడం వంటివి కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం టిడిపికి స్థానికంగా మద్దతు ఎక్కువ కనిపిస్తోంది. బీటెక్ రవి వ్యూహాలు అదేవిధంగా టిడిపి అధిష్టానం అనుసరిస్తున్న పద్ధతులు వంటివి ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమీలమ్మ రంగంలోకి దిగడంతో వైఎస్ ఫ్యామిలీ ప్రభావం కూడా ఉంటుందన్నది పరిశీలకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఏది ఏమైనా జగన్కు ఇది అత్యంత సవాలుగా మారనుందన్నది ఖాయం.